HomePoliticsNational

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే షర్మిలకు నియామక లేఖ అ

కాంగ్రెస్ కు షాక్: బీఆరెస్ లో చేరిన కీలక నేత
మల్కాజీగిరి ఎంపీగా పోటి చేయడానికి పట్టుబడుతున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
కాంగ్రెస్ కార్యకర్తల‌ను కాల్చి పడేస్తానన్న బీఆరెస్ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే షర్మిలకు నియామక లేఖ అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.

షర్మిలకు మార్గాన్ని క్లియర్ చేస్తూ నిన్ననే ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. రుద్రరాజుకు పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో షర్మిల తన పార్టీని ఎన్నికల బరికి దూరంగా ఉంచారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనక ప్రధాన భూమిక పోషించింది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అనే వార్తలు ఉన్నాయి.

కాగా, ఈ సందర్భంగా తనను నమ్మి ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఖర్గే,సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,కేసీ వేణుగోపాల్, మాణిక్ టాగోర్ లకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. ”పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని పూర్వ వైభవంగా పునర్నిర్మించడానికి నమ్మకంగా పని చేస్తానని హామీ ఇస్తున్నాను.” అని ఆమె ట్వీట్ చేశారు.
”గిడుగు రుద్రరాజు, పార్టీలోని ప్రతి ఇతర నాయకులతో కలిసి వారి అనుభవం,నైపుణ్యంతో మా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్నాను.” అని ఆమె అన్నారు.