HomePoliticsAndhra Pradesh

టీడీపీ, జనసేన కూటమి తరపున పోటీ చేస్తా – వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

టీడీపీ, జనసేన కూటమి తరపున పోటీ చేస్తా – వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

నాలుగేళ్ల తర్వాత నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంతూరికి వెళ్ళారు. ఈ మధ్యాహ్నం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా రఘురామ

తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు
అబద్దాలు ప్రచారం చేయడంలో దేశంలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ?
కాంగ్రెస్ బలంగా ఉన్న చోటే బీజేపీ కార్యక్రమాలు.. ఇది దేనికి సంకేతం?

నాలుగేళ్ల తర్వాత నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంతూరికి వెళ్ళారు. ఈ మధ్యాహ్నం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు.

ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ, టీడీపీ-జనసేన కలిసిన రోజే ఏపీ కోస్తాలో వైసీపీ పనైపోయిందని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి రెండో వారంలో వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని వెల్లడించారు.అయోధ్య ఆలయం ప్రారంభం తర్వాత ఏపీలో బీజేపీతో… టీడీపీ-జనసేన పొత్తుపై స్పష్టత వస్తుందని అన్నారు. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళతాయని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రఘురామ అన్నారు.

సొంత నియోజకవర్గానికి రాకుండా ఇన్నాళ్లూ ఇబ్బందిపెట్టారని వ్యాఖ్యానించారు. చాన్నాళ్ల తర్వాత సొంత నియోజకవర్గానికి వచ్చిన తనకు టీడీపీ, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారని వెల్లడించారు.