HomeNational

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా గాంధీ

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా గాంధీ

జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావద్దని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్య

జనవరి 22న అయోద్యకు వస్తున్నా… స్వామి నిత్యానంద‌
రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించిన‌ నలుగురు శంకరాచార్యులు
ప్రభాస్ న్యూస్…. అదంతా ఫేక్

జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావద్దని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు , రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే,లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ అధిర్ రంజన్ చౌదరి లు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రామందిర ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారు.

ఈ మేరకు ఆ పార్టీ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేస్ఝ్ ఓ ప్రకటన విడుదల చేశారు. మన దేశంలో లక్షలాది మంది రాముడిని పూజిస్తారు. మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ RSS/BJP చాలా కాలంగా అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా తయారుచేశాయి. అసంపూర్తిగా ఉన్న ఈ ఆలయాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ప్రారంభించడం ఎన్నికల లబ్ధి కోసం ముందుకు తెచ్చినట్లు స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు. అందువల్ల 2019 సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి, శ్రీరాముడిని గౌరవించే లక్షలాది మంది మనోభావాలను గౌరవిస్తూ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే, శ్రీమతి. సోనియా గాంధీ, శ్రీ అధీర్ రంజన్ చౌదరి స్పష్టంగా RSS/BJP ఈవెంట్‌కు ఆహ్వానాన్ని తిరస్కరించారని జైరాం రమేష్ పేర్కొన్నారు.