HomeTelanganaPolitics

తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం …పోస్టర్ల హల్ చల్

తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం …పోస్టర్ల హల్ చల్

ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, ఎంపీ రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ నేతలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ రోజు నగరానికి రానుండటంతో తెలంగాణ యువక

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారైనట్టేనా ?
బీఆరెస్ కన్నా ముందంజలో కాంగ్రెస్…. ‘సౌత్ ఫస్ట్ న్యూస్’ ప్రీ పోల్ సర్వే వెల్లడి
బీఆరెస్ కు ఓటమి భయం పట్టుకుందా ? రంగంలోకి పీకేను దించిన కేసీఆర్ ?

ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, ఎంపీ రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ నేతలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ రోజు నగరానికి రానుండటంతో తెలంగాణ యువకుల ప్రాణాలు బలికావడానికే కాంగ్రెస్ నాయకులే బాధ్యులంటూ శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. ఇవి వేసిన వారి పేర్లు మాత్రం పోస్టర్లలో లేదు. కానీ బీఆరెస్ నాయకులే ఈ పోస్టర్లు అంటించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కాంగ్రెస్ ఈ రోజు సీనియర్ నేతలు నగరానికి వస్తున్నారు. అయితే, వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని, 10 హెచ్‌పి మోటారును ఉపయోగిస్తే సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ వాదనలపై కూడా కొన్ని పోస్టర్లు ఏర్పాటు చేయబడ్డాయి.
ఒక పోస్టర్‌లో ”తమ పొలాల్లో 10 హెచ్‌పీ మోటార్లు వాడే రైతులు కాంగ్రెస్‌కు ఓటేస్తారు, అలాంటి మోటార్లు ఉపయోగించని వారు బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారు. రాజకీయ యాత్రికుడు రాహుల్ గాంధీకి స్వాగతం” అని ప్రెఇంట్ చేసి ఉంది.

ఇది కాకుండా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ యువత ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ కొన్ని ప్రాంతాలలో పోస్టర్లు వేశారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ యువత ప్రాణాలు కోల్పోయినందుకు కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం గురువారం క్షమాపణలు చెప్పారు. అయితే క్షమాపణ‌ చాలా ఆలస్యమైందని , తమపై కాంగ్రెస్ పాల్పడ్డ క్రూరత్వాన్ని ప్రజలు మర్చిపోరని పాలక BRS మండిపడుతోంది.హామీలు ఇవ్వడానికి అగ్రనేతలు, క్షమాపణలు చెప్పడానికి బంట్రోతులా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.