HomeTelanganaPolitics

కాంగ్రెస్: నల్గొండ జిల్లాలో సీనియర్ల‌ మాటే చెల్లుబాటు… అక్కడ రేవంత్ రెడ్డి చెల్లని నాణమేనా ?

కాంగ్రెస్: నల్గొండ జిల్లాలో సీనియర్ల‌ మాటే చెల్లుబాటు… అక్కడ రేవంత్ రెడ్డి చెల్లని నాణమేనా ?

ఉమ్మడి నల్గొండ జిల్లాలో టిక్కట్ల కేటాయింపులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటకు అసలు చెల్లుబాటు లేకుండా పోయింది. తాను నౌకున్న ఒక్కరికి కూడా ఆ జిల్

55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
మధుయాష్కీ, పొంగులేటికి కాంగ్రెస్ లో కీలక పదవులు
BRS టూ BRS వయా కాంగ్రెస్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో టిక్కట్ల కేటాయింపులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటకు అసలు చెల్లుబాటు లేకుండా పోయింది. తాను నౌకున్న ఒక్కరికి కూడా ఆ జిల్లాలో టికట్ ఇప్పించుకోలేకపోయారు. అక్కడ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మాటే అధిష్టానం వద్ద చెల్లుబాటు అయ్యింది.

తుంగతుర్తి సీటును అద్దంకి దయాకర్ కు ఇప్పించాలని రేవంత్ రెడ్డి చివరి వరకు ప్రయత్నించారు. అధిష్టానం వద్ద పట్టుబట్టారు కూడా. అయితే ఎట్టి పరిస్థితుల్లో అద్దంకి దయాకర్ కు టికట్ రాకుండా చేయడం కోసం కోమటి రెడ్డి చేయని ప్రయత్నం లేదు. చివరకు అధిష్టానం రేవంత్ అభిప్రాయాన్ని పక్కనబెట్టి కోమటి రెడ్డి రెకమండ్ చేసిన శామేల్ కు టికట్ ఇచ్చింది.

ఇక సూర్యాపేట నియోజకవర్గంలో పటేల్ రమేశ్ రెడ్డికి టికట్ ఇప్పించాలని ప్రయత్నించాడు. అయితే ఇక్కడ సీనియర్ నేత దామోదర్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి కాంగ్రెస్ సీనియర్లు మద్దతు పలికి రేవంత్ మాట చెల్లకుండా చేశారు. చివరకు కాంగ్రెస్ అధిష్టానం దామోదర్ రెడ్డినే సూర్యాపేట అభ్యర్థిగా ప్రకటించింది.

అలాగే మునుగోడు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అనుచరుడు చలమల్ల కృష్ణారెడ్డి టికెట్ ఆశించారు. ఆయనకు ఈ సారి టికట్ తప్పకుండా ఇస్తామని అధిష్టానం కూడా చెప్పింది. ఆయనకు టికట్ ఇప్పించడం కోసం రేవంత్ కూడా తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి రాజీనామా చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆయనకే మునుగోడు టికట్ ఇచ్చింది అధిష్టానం. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికట్ ఇప్పించడంలో అధిష్టానం వద్ద చక్రం తిప్పింది రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డే. ఇక్కడ కూడా రేవంత్ కు మొండి చేయే చూపించారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ టికెట్ తో పాటు సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు, ఆలేరు నుంచి తన అనుచరు బీర్లు ఐలయ్యకు, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి నుంచి మందుల శామెల్‌కు టికెట్ ఇప్పించుకుని రేవంత్ రెడ్డిపై పైచేయి సాధించారు. మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు హుజూర్‌నగర్ టికెట్‌తో పాటు కోదాడ నుంచి తన సతీమణి పద్మావతికి టికెట్ ఇప్పించుకున్నారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి తన కుమారుడికి టికట్ ఇప్పుంచుకున్నారు.

గతంలో రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర కోసం నల్గొండజిల్లాలో సన్నాహ సమావేశం నిర్వహి‍ంచేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించగా దానిని అడ్డుకొని రేవంత్ నల్గొండకు రావద్దని కోమటి రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడేమో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులందరినీ సీనియర్లే డిసైడ్ చేసి రేవంత్ కు అక్కడ అభ్యర్థుల ఎంపికలో స్థానం లేకుండా చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీకి అధ్యక్షుడే కావచ్చు కానీ నల్గొండజిల్లాలో మాత్రం సీనిఅయర్ నేతలెవ్వరూ ఆయనను అంగీకరించే పరిస్థితి లేదు. రేపు ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డికి, నల్గొండ జిల్లా సీనియర్లకు మధ్య యుద్దం తప్పకపోవచ్చు.