దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తిని రోబో చంపేసింది. ప్యాకెట్స్ ను కన్వేయర్ బెల్ట్ పై పెట్టే పనిలో ఉన్న రోబో ఓ వ్యక్తిని ప్యాకెట్గా పొరబడి కన్వేయర్ బెల్ట
దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తిని రోబో చంపేసింది. ప్యాకెట్స్ ను కన్వేయర్ బెల్ట్ పై పెట్టే పనిలో ఉన్న రోబో ఓ వ్యక్తిని ప్యాకెట్గా పొరబడి కన్వేయర్ బెల్ట్ పై వేసి చంపేసింది.
దక్షిణ కొరియాలో 40 ఏళ్ల రోబోటిక్స్ కంపెనీ ఉద్యోగి రోబోను తనిఖీ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. కూరగాయల పెట్టెలను కన్వేయర్ బెల్ట్ పై పెడ్తున్న రోబో తనను పరీక్షిస్తున్న వ్యక్తిని పెట్టెగా భావించింది. అతని చేయిపట్టికొని లాగొ బెల్ట్ పై వేసింది. అతన్ను అదిమి పట్టి యంత్రంలోనికి తోసింది.
యంత్రంలో పడి పోయిన ఆ వ్యక్తి ఆ యంత్రంలో నలిగిపోయాడు.ఈ క్రమంలో ఆ వ్యక్తి ముఖం, ఛాతీ తీవ్రంగా నలిగిపోయాయి. అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. చికిత్స పొందుతూ మరణించాడని దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్‌హాప్ నివేదించింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో, దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్నప్పుడు రోబోట్‌లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. 2015లో 22 ఏళ్ల కార్మికుడిని రోబో చంపేసింది.