BRS వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ శాఖ మంత్రి KTRకు గురువారం ప్రమాదం తప్పింది. ఆర్మూర్‌లో జీవన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ సందర్భంగా జరిగిన జరిగిన రోడ్‌షోలో
BRS వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ శాఖ మంత్రి KTRకు గురువారం ప్రమాదం తప్పింది. ఆర్మూర్‌లో జీవన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ సందర్భంగా జరిగిన జరిగిన రోడ్‌షోలో తన ప్రచార వాహనం నుండి పూర్తిగా కిందికి ఒరిగిపోయాడు. దాదాపు పడిపోయే పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు.
ప్రచార వాహనం డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వాహనం పైభాగంలో ఉన్న రెయిలింగ్ విరిగిపోయి, మంత్రితో పాటు ఆయన పక్కనే ఉన్న ఇతరులు కిందికి ఒరిగిపోయారు. ఆర్మూర్ అభ్యర్థి జీవన్‌రెడ్డి వాహనంపై నుంచి కిందపడగా, వెనుక నిలబడిన కేటీఆర్ గన్‌మెన్ అతడిని పట్టుకుని వాహనంపై నుంచి కిందపడకుండా అడ్డుకున్నాడు. జీవన్‌రెడ్డికి ప్రథమ చికిత్స అందించగా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు తన ప్రచారాన్ని కొనసాగించిన కేటీఆర్ కొడంగల్‌లో మరో రోడ్డుషోకి బయలుదేరారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని మంత్రి కార్యాలయం తెలిపింది.