తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయకుడదన
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయకుడదని ఆ పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు జ్ఞానేశ్వర్ ప్రకటించారు.
తాను టీడీపీకి అధ్యక్షుడయ్యాక పార్టీకోసం డబ్బులు ఖర్చుపెట్టానని, పార్టీని బలోపేతం చేశానని, ప్రతి జిల్లాలో కార్యకర్తలను తయారు చేశానన్నారాయన.
ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ ఎందుకని జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కు మద్దతు తెలపడం కోసమే టీడీపీని పోటీలో లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో పోటీ చేయడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నారని అయితే లోకేశ్ మాత్రం పోటీ వద్దన్నారని జ్ఞానేశ్వర్ చెప్పారు. 20 సార్లు ఫోన్లు చేసినా కూడా లోకేశ్ స్పందించలేదని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అనుచరులతో చర్చించిన తర్వాత తన భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటిస్తానన్నారు.