HomePoliticsNational

మోడీతో వేదిక పంచుకోబోను – బిజెపి మిత్ర పక్ష ముఖ్యమంత్రి సంచలన ప్రకటన‌

మోడీతో వేదిక పంచుకోబోను – బిజెపి మిత్ర పక్ష ముఖ్యమంత్రి సంచలన ప్రకటన‌

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో తమ‌ పార్టీ ఉన్నప్పటికీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నరే

తెలంగాణలో హంగ్ వస్తే బీఆరెస్, బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందా ?
మోడీ మళ్ళీ ఏడ్చాడు
I.N.D.I.A కూట‌మి కీలక నిర్ణయాలు

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో తమ‌ పార్టీ ఉన్నప్పటికీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నరేంద్ర మోడీ ప్రచారానికి వచ్చినప్పుడు తాను ప్రధానితో వేదికను పంచుకోనని మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా చెప్పారు.

“మిజోరాం ప్రజలందరూ క్రైస్తవులు. మణిపూర్ లో మైతీలు వందలాది చర్చిలను తగలబెట్టినందుకు మిజోలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ సమయంలో బీజేపీతో కలిసి పనిచేయడం నా పార్టీకి నా పాయింట్‌కి పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది” అని జోరమ్‌తంగా బీబీసీ న్యూస్‌తో అన్నారు.

“ప్రధానమంత్రి విడిగా తన సభలకు హాజరయ్యి వెళ్ళిపోవాలి. నేను నా సభలకు హాజరవుతాను. ఎవరికి వారు విడివిడిగా ప్రచారం చేయడమే మంచిది.” అని ఆయన అన్నారు.

శరణార్థుల నుంచి బయోమెట్రిక్ డేటాను సేకరించాలన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను తమ ప్రభుత్వం పాటించడం లేదని జోరమ్‌తంగా గత నెలలో చెప్పారు. “మయన్మార్ శరణార్థుల బయోమెట్రిక్, బయోగ్రాఫిక్ డేటాను సేకరించడమంటే మన రక్త బంధువులైన సోదరులు, సోదరీమణుల పట్ల వివక్ష చూపడమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికిప్పుడు దీన్ని చేపట్టకూడదని నిర్ణయించాం’’ అని ఆయన చెప్పారు.

బిజెపి తేవాలనుకుంటున్న‌ యూనిఫాం సివిల్ కోడ్ ప్రణాళికలకు కూడా మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా వ్యతిరేకంగా మాట్లాడారు. మణిపూర్‌లో జరిగిన జాతి హింసపై రాష్ట్ర , కేంద్ర బిజెపి ప్రభుత్వాలు తప్పుగా వ్యవహరిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు.