HomeTelanganaPolitics

తెలంగాణలో కారుదే జోరు – స్పష్టం చేసిన తాజా సర్వే రిపోర్ట్స్

తెలంగాణలో కారుదే జోరు – స్పష్టం చేసిన తాజా సర్వే రిపోర్ట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ సర్వే సంస్థలు తమ సర్వే రిపోర్టులు విడుదల చేస్తున్నాయి. తాజాగా మిషన్‌ చాణక్య,ఇండియా టీవీ, ఫ్యాక్ట్స్

దేశంలో స్వతంత్ర జర్నలిజాన్ని అంతం చేసేందుకు పాలకుల దుర్మార్గ దాడులు
పాపం కృష్ణ మాదిగ…అంతన్నారింతన్నారు….అద్దాల మేడన్నారు… చివరకు తుస్సుమనిపించిన మోడీ
12 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ సర్వే సంస్థలు తమ సర్వే రిపోర్టులు విడుదల చేస్తున్నాయి. తాజాగా మిషన్‌ చాణక్య,ఇండియా టీవీ, ఫ్యాక్ట్స్‌ మార్కెటింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ సర్వీసెస్‌ సంస్థలు వేర్వేరుగా నిర్వహించిన సర్వేలు భారత రాష్ట్ర సమితి భారీ విజయాన్ని సాధిస్తుందని తెలిపాయి. కాంగ్రెస్ కు, బీఆరెస్ కు దాదాపు 10 శాతం ఓట్ల తేడా ఉంటుందని సర్వేలు చెప్పాయి. బీజేపీకైతే చాలా చోట్ల డిపాజిట్లు కూడా రావని సర్వేలు తేల్చాయి.

మిషన్ చాణక్య ప్రకారం బీఆర్‌ఎస్‌కు 44.62 శాతం ఓట్లు వస్తాయి. అదే కాంగ్రెస్‌ 32.71 శాతానికే పరిమితం కానున్నట్లు సర్వే రిపోర్ట్ తెలిపింది. ఇక బీజేపీకి 17.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వేలో తెలిసింది. గత నాలుగు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అధ్యయం చేసి, 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ డేటాను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌ పార్టీ కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది.

ఇక ప్రముఖ జాతీయ టీవీ చానల్‌ ఇండియా టీవీ నిర్వహించిన సర్వే కూడా బీఆర్‌ఎస్ దే విజయమని తేల్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీ 70 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 34 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నది. ఇక ఈ సర్వే ప్రకారం బీజేపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కానున్నది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 7 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని తెలిపింది. ఎంఐఎం కూడా 7 స్థానాలు గెలుచుకుంటుందని, ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకుంటారని సర్వే తేల్చింది.

కాగా, ఫ్యాక్ట్స్‌ మార్కెటింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ సర్వీసెస్‌ సంస్థ నిర్వహించిన ప్రీపోల్‌ సర్వేలో కూడా ప్రజలు బీఆర్‌ఎస్ కే పట్టం కడతారని తేలింది. మొత్తం 119 స్థానాలకుగాను బీఆర్‌ఎస్‌ పార్టీ ఏకంగా 73-78 సీట్లు గెలుచుకోబోతున్నదని ఈ సర్వే వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 17,850 పోలింగ్‌ కేంద్రాల్లో 1.12 లక్షల మంది ఓటర్ల అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించి సర్వే నిర్వహించింది. కాంగ్రెస్‌కు 25-30 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నదని సర్వే పేర్కొన్నది. బీజేపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమతయ్యే పరిస్థితి ఉన్నదని వెల్లడించింది. బీజేపీకి 6-10 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. ఎంఐఎంకు 7-8 సీట్లు, ఇతరులకు ఒక సీటు వస్తుందని పేర్కొన్నది.