HomeTelanganaPolitics

రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసిన బీజేపీ – మళ్ళీ గోషామహల్ నుంచి ఎన్నికల బరిలోకి

రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసిన బీజేపీ – మళ్ళీ గోషామహల్ నుంచి ఎన్నికల బరిలోకి

ముందునుంచి అందరూ అనుకున్నదే జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేసింది.ఖు

మోడీ ఉపన్యాసంపై మండిపడ్డ బీజేపీ సీనియర్ నేత
నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతురా?: బండి సంజయ్
ఈటలపై పైచేయి సాధించిన బండి సంజయ్…వేములవాడలో టెన్షన్ టెన్షన్

ముందునుంచి అందరూ అనుకున్నదే జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేసింది.
ఖురాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని రాజాసింగ్ ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన రోజు నుంచే, తాను తిరిగి బీజేపీలోకి వస్తానని రాజాసింగ్ ధీమాగా ఉన్నారు. ఆయన అనుకున్నట్టే బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తి వేస్తూ ప్రకటన జారీ చేసింది.

రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తి వేయడమే కాక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు గోషామహల్ నియోజకవర్గం నుంచి బరిలో దింపింది. ఈమేరకు బీజేపీ విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో రాజా సింగ్ పేరును పార్టీ అధిష్ఠానం చేర్చింది.

రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తి వేయడానికి బండి సంజయ్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన అధిష్టానంతో రాజా సింగ్ విషయంపై అనేక మార్లు చర్చలు జరిపినట్టు సమాచారం.