HomeTelanganaNational

మోగనున్న అసె‍ంబ్లీ ఎన్నికల నగారా – ఈ నెల 10లోపు నోటిఫికేషన్ విడుదల‌

మోగనున్న అసె‍ంబ్లీ ఎన్నికల నగారా – ఈ నెల 10లోపు నోటిఫికేషన్ విడుదల‌

తెలంగాణ తో సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 8 లేదా 10వ తేదీల్లో సెంట్రల్ ఎలక్షన

హరీష్ రావు వ్యాఖ్యలతో రైతు బంధు డబ్బుల పంపిణీని నిలిపివేసిన ఈసీ
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన: హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బిజీ సమావేశాలు
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

తెలంగాణ తో సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 8 లేదా 10వ తేదీల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుందని సమాచార‍ం.

డిసెంబర్ మొదటి వారంలోపు ఎన్నికలు పూర్తయ్యి డిసెంబర్ 10 నుంచి 15 మధ్య ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుందని తెలుస్తోంది. ఒక్క చత్తీస్ గడ్ లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో ఒకే విడత ఎన్నికలు జర‌గనున్నాయి. మావోయిస్టు ప్రభావిత చత్తీస్ గడ్ లో మాత్రం రెండు విడుతలుగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో పర్యటించిన కేంధ్ర ఎన్నికల సంఘం ఈ మధ్యే తెలంగాణలో పర్యటించింది. ఇక్కడ అధికారులతో, వివిధ పార్టీల నాయకులతో, ఓటర్లతో సమావేశమయ్యింది. ఇక ఈ రోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై వీరితో చర్చించి ఆ తర్వాత‌ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేయనుంది.