కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని 'న్యూ ఏజ్ రావణుడు'గా అభివర్ణిస్తూ అధికార పార్టీ బీజేపీ ఎక్స్‌లో పోస్టర్‌ను షేర్ చేయడంతో గురువారం సోషల్ మీడియాలో కాంగ్రెస
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ‘న్యూ ఏజ్ రావణుడు’గా అభివర్ణిస్తూ అధికార పార్టీ బీజేపీ ఎక్స్‌లో పోస్టర్‌ను షేర్ చేయడంతో గురువారం సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్ మొదలైంది. ”రాహుల్ గాంధీని రావణుడిగా అభివర్ణించడం ఆమోదయోగ్యం కాదు. ఇది ఖచ్చితంగా ప్రమాదకరమైనది” అని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘అతిపెద్ద అబద్ధాలకోరు’ అనే శీర్షికతో, ‘ త్వరలోఎన్నికల ర్యాలీకి వెళ్లనున్న ‘జుమ్లా బాయ్’ అంటూ మరొకరు ఆయన చిత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక రోజు తర్వాత ఈ పోస్టర్ బయటకు వచ్చింది. ”.
ఆ తర్వాత బిజెపి X లోని తన అధికారిక హ్యాండిల్‌లో ”భారత్ ఖత్రే మే హై – కాంగ్రెస్ పార్టీ ఉత్పత్తి” అనే శీర్షికతో రాహుల్ గాంధీని రావణుడితో పోలుస్తూ పోస్టర్‌ను షేర్ చేసింది.
”కొత్త యుగం రావణుడు వచ్చాడు. అతడు దుర్మార్గుడు. ధర్మ వ్యతిరేకి. రాముడికి వ్యతిరేకి . భారత్‌ను నాశనం చేయడమే అతని లక్ష్యం’’ అని బీజేపీ ఎక్స్‌లో పేర్కొంది.
భారతదేశాన్ని విభజించాలనుకునే శక్తులు హింసను ప్రేరేపించడానికి రాహుల్ పై ఇలాంటి విమర్శలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
”బీజేపీ అధికారిక హ్యాండిల్ ద్వారా రాహుల్ గాంధీని రావణుడిగా చిత్రీకరించిన దారుణమైన గ్రాఫిక్ అసలు ఉద్దేశం ఏమిటి? తండ్రిని,నానమ్మలను హత్య చేసిన శక్తులు, భారతదేశాన్ని విభజించాలనుకునే శక్తులు రాహుల్ పై హింసను ప్రేరేపించడం కోసమే ఈ చర్యలను చేపడుతున్నారు. ”అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేసారు.
”ప్రధానమంత్రి అబద్ధాలకోరుగా, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారనడానికి ఇదొక సాక్ష్యం.” అని రమేష్ అన్నారు.
”మేం బెదిరిపోము,” అని ఆయన తేల్చిచెప్పారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజేషన్, కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడుతూ, ”బీజేపీ షేర్ చేసిన సిగ్గుమాలిన గ్రాఫిక్స్‌ని పోల్చడానికి పదాలు సరిపోవు. ”వారి నీచమైన ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి, వారు అతన్ని హత్య చేయాలనుకుంటున్నారు. చిన్న రాజకీయ పాయింట్లను స్కోర్ చేయడానికి వారు అతని SPG రక్షణను ఉపసంహరించుకున్నారు. రాహుల్ ను అతని సురక్షిత నివాసం నుండి తొలగించిన తర్వాత, అతను కోరిన మరో ఇంటిని వారు కేటాయించలేదు, ”అని వేణుగోపాల్ అన్నాడు.
తర్వాత, భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బి వి, ప్రధాని మోదీని మో దానవ్ గా చిత్రీకరిస్తూ ఎక్స్‌పై మరో పోస్టర్‌ను పోస్ట్ చేశారు.
“హిందుస్తాన్ ఖత్రే మే హై మో దానవ్” భారత్ జుమ్లేబాజ్ పార్టీ ప్రొడక్షన్. పరమ మిత్ర అదానీ దర్శకత్వం వహించారు. అని రాసి ఉండి మోడీ తలపై రెండు కొమ్ములున్న చిత్రాన్ని షేర్ చేసిన బీవీ శ్రీనివాస్
”కొత్త యుగం మో దానవ్ వచ్చాడు. అతడు దుర్మార్గుడు. ప్రజాస్వామ్య వ్యతిరేకి. రాజ్యాంగ వ్యతిరేకి. ప్రజా వ్యతిరేకి. మానవత్వానికి వ్యతిరేకి. అతని ఏకైక లక్ష్యం భారత్ను, భారతదేశం యొక్క ఆలోచనను నాశనం చేయడమే, ” అని కామెంట్ చేశాడు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రెండు ప్రధాన పార్టీల మధ్య యుద్ధం తీవ్రమవుతుండటం తో ఆ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ప్రచార దాడులను ముమ్మరం చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రానున్న నెలల్లో రెండు పార్టీల మధ్య పోస్టర్ వార్ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
The new age Ravan is here. He is Evil. Anti Dharma. Anti Ram. His aim is to destroy Bharat. pic.twitter.com/AwDKxJpDHB
— BJP (@BJP4India) October 5, 2023
The new age MODANAV is here. He is Evil. Anti Democracy. Anti Constitution. Anti People. Anti Humanity.
— Srinivas BV (@srinivasiyc) October 5, 2023
His only aim is to destroy Bharat & the idea of INDIA. https://t.co/eEXAOWtlaY pic.twitter.com/xaTYJ59qxl