HomeTelangana

BJP, BRS, MIM ల మధ్య సీట్ల ఒప్పందం జరిగిందా ?

BJP, BRS, MIM ల మధ్య సీట్ల ఒప్పందం జరిగిందా ?

ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ లో మాట్లాడిన మాటలు రాజకియాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. బీఆరెస్ ను ఎన్డీఏ లో చేర్చుచుకోవాల్సిందిగా, కేటీఆర్ ను ముఖ్యమ

ఇండియానా లేక భారతా? పేరు మార్చడం సరి కాదని 2016లో సుప్రీంకోర్టుకు చెప్పిన మోడీ సర్కార్
బీజేపీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్యే
I.N.D.I.A కూట‌మి కీలక నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ లో మాట్లాడిన మాటలు రాజకియాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. బీఆరెస్ ను ఎన్డీఏ లో చేర్చుచుకోవాల్సిందిగా, కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ఆశీర్వాదించ‌చవలసిందిగా KCR తనను కోరారని మోడీ Modi చెప్పడంతో కాంగ్రెస్ కు మంచి ఆయుధం అందింది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు PCC President రేవంత్ రెడ్డి Revanth reddy సంచలన విషయాలు బైటపెట్టారు.

బీఆరెస్ BRS, బీజేపీ BJPల మధ్య పొత్తు కుదిరిందన్న విషయం బీఆరెస్ ఎంపీలే తనతో చెప్పారని రేవంత్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేయాలని, కాంగ్రెస్ Congress ఓట్లను బీజేపీ చీల్చి బీఆరెస్ గెలుపునకు సహకరించాలని, పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల పంపకం చేసుకోవాలని ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు.

మొత్తం 17 పార్లమెంటు సీట్లలో BRS 9, BJPపీ 7, MIM 1 నియోజకవర్గంలో పోటీ చేయడానికి రెండుపార్టీలు ఒక అవగాహనకు వచ్చాయని చెప్పిన రేవంత్ రెడ్డి, ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీలే తనతో చెప్పారన్నారు. బీజేపీ సిట్టింగ్ స్థానాలైన సికిందరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తో సహా మల్కాజిగిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్ స్థానాలను బీజేపీకి ఇవ్వడానికి ఒప్పందం జరిగిందన్నారు రేవంత్.

కాగా, బీఆరె, బీజేపీ ల మధ్య సీట్ల పంపకం జరగనుందన్న రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ నేత ఈటల రాజేంధర్ ఖండించారు. తాము బీఆరెస్ తో పోరాటం చేస్తున్నామని , ఆ పార్టీతో పొత్తు అవకాశమే లేదన్నారు.