హైదరాబాదీ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా భోజన ప్రియులు లొట్టలేస్తారు. ఒక్కసారి హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేసినవారు దాన్ని ఎప్పటికీ వదిలి పెట్టరు. తిం
హైదరాబాదీ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా భోజన ప్రియులు లొట్టలేస్తారు. ఒక్కసారి హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేసినవారు దాన్ని ఎప్పటికీ వదిలి పెట్టరు. తింటున్నాకొద్దీ తినాలనిపించే ఈ బిర్యానీ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులకు కష్టాలు తెచ్చిపెట్టిందట.
ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ పర్యటనకు వచ్చిన పాక్ క్రికెట్ జట్టుకు హైదరాబాద్‌లో అద్భుతమైన, హృదయపూర్వక స్వాగతం లభించింది. పాకిస్థాన్ గురువారం నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమైంది.
ప్రస్తుతం పాక్ జట్టు వార్మప్ మ్యాచ్ లు ఆడుతోంది. అయితే ఆ జట్టు సరియైన ఆటతీరు ప్రదర్శించడంలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ కూడా బద్దకంగా చేస్తున్నారు.
ఈ జట్టు ఇప్పటి వరకు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడింది, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్‌లో ఓడిపోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 14 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
అయితే వీళ్ళ ఆట తీరుకు హైదరాబాద్ బిర్యానీకి ఏంటి లింక్ అనే సందేహం మీకు వస్తుంది కదా ! ఆ లింక్ ఏంటో పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ చెప్పారు.
హైదరాబాద్ కు వచ్చినప్పటి నుంచి పాక్ ఆటగాళ్ళకు నగరంలో అగ్ర హోటళ్లలో ఒకటైన పార్క్ హయత్‌లో బస ఏర్పాటు చేశారు. అక్కడ వారికి వడ్డిస్తున్న ఆహారంలో ప్రపంచంలోనే ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ విపరీతంగా నచ్చేసింది. లంచ్, డిన్నర్ అన్నీ హైదరాబాద్ బిర్యానీయే లాగించేస్తున్నారు. దాంతో వారికి బద్దకం వచ్చేసిందట. మైదానంలో వాళ్ళ కదలిక నెమ్మదించిందట.
మ్యాచ్ ఓటమి తర్వాత, నగరానికి చెందిన ప్రముఖ భారతీయ వ్యాఖ్యాత హర్షా భోగ్లే, ప్రసిద్ధ హైదరాబాదీ బిర్యానీ గురించి షాదాబ్ ఖాన్‌ను అడగగా, ఆయన ఉల్లాసంగా సమాధానం ఇచ్చారు.
“రోజూ తింటున్నాం, అందుకే కాస్త స్లో అవుతున్నాం” అని నవ్వుతూ అన్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగే తమ టోర్నీ ఓపెనర్‌లో నెదర్లాండ్స్‌తో పాకిస్థాన్ తలపడనుంది.
Pakistan & fielding never ending love story 🥰😄😄 #PakistanFielding #PakCricket pic.twitter.com/AJzT90hgNM
— Shikhar Dhawan (@SDhawan25) October 3, 2023