తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 62 చోట్ల ఎన్ ఐఏ సోదాలు నిర్వహించింది. ఏక కాలంలో జరిగిన ఈ సోదాల్లో అనేక బృందాలు పాల్గొన్నాయి.పౌర హక్కుల సంఘం, కుల న
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 62 చోట్ల ఎన్ ఐఏ సోదాలు నిర్వహించింది. ఏక కాలంలో జరిగిన ఈ సోదాల్లో అనేక బృందాలు పాల్గొన్నాయి.
పౌర హక్కుల సంఘం, కుల నిర్మూలన పోరాట సంఘం, అమరుల బంధు మిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం , పీడీఎం, ప్రజాకళామండలి, విరసం, ప్రగతిశీల కార్మిక సంఘం, IAPL తదితర సంస్థల నాయకులు, కార్యకర్తల ఇళ్ళలో ఎన్ ఐ ఏ సోదాలు నిర్వహించింది.
కాగా ఎన్ ఐ ఏ దాడులను పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
CLC ప్రెస్ రిలీజ్:
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోఈరోజు 2 అక్టోబర్2023 ఉదయం 6గంటల నుండి NIA పోలీసులు, పౌర హక్కుల, ప్రజాసంఘాల నాయకుల ఇండ్లల్లో చేస్తున్న దాడులను పౌర హక్కుల సంఘం ఖండిస్తున్నది…
ఈరోజు 2 అక్టోబర్2023 ఉదయం హైదరాబాద్ లోని సుభాష్ నగర్ లో నివసిస్తున్న ABMS నాయకులు భవాని ఇంటిపై NIA పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.
ABMS నాయకురాలు శాంతక్క వరంగల్ ఇంటిపై,
ABMS నాయకురాలు ధనలక్ష్మి, శ్రీకాకుళం,
ABMS నాయకురాలు శోభ, ప్రకాశం,
ABMS నాయకుడు, కోదండు,శ్రీకాకుళం.
హైదరాబాద్, విద్యానగర్ లోని IAPL జాతీయ కార్యదర్శి అడ్వకేట్ సురేష్ ,పిచ్చుక శ్రీనివాస్ అడ్వొకేట్, IAPL,ఆంధ్రప్రదేశ్,
CLC ఆంధ్రప్రదేశ్ నాయకులు……
CLCనెల్లూరు జిల్లా పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు
CLC, AP, తిరుపతి పట్టణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం నాయకులు, న్యాయవాది క్రాంతి చైతన్య ఇంటిపై,
CLC, AP,నంబూరి శ్రీమన్నారాయణ అడ్వొకేట్,,పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్,
CLC, AP ,ఆంజనేయులు,పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు,విజయవాడ,
CLC, AP పోతుగంటి రాజారావు, అడ్వొకేట్, పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు,
CLC, AP,శ్రీరాములు,పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు,అనంతపురం,
CLC, AP,డాక్టర్ రాజారావు, పౌర హక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్, పొన్నూరు,
CLC, AP,నజర్,పౌర హక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి.
CLC AP, చీమలపెంట వెంకటేశ్వర్లు,పౌర హక్కుల సంఘం కడప,
HRF నాయకురాలు సుధ, విశాఖపట్నం,
CMS నాయకురాలు, సిసొరా నెల్లూరు,
CMS నాయకురాలు రాధ, విజయవాడ,
CMS S అనిత నాయకురాలు, హనుమకొండ,
PKS నాయకులు బత్తుల రమణయ్య, తాడేపల్లి గూడెం,
విరసం నాయకులు:రివేరా ఆంధ్రప్రదేశ్,Pకిరణ్,ఆంధ్రప్రదేశ్
విరసం నాయకులు సాగర్, హైదరాబాద్, ,
PKM,G.రాంచందర్ నాయకులు షాద్ నగర్, ,
PKM, రాణి, సత్తెనపల్లి, నాగేశ్వరరావు, సత్తెనపల్లి.
మిస్క కృష్ణయ్య,KNPS నాయకులు,శ్రీకాకుళం,
బాలయ్యKNPS నాయకులు కావలి.
దుడ్డు వెంకటరావు KNPS నాయకులు
ఓర్సు శ్రీనివాసరావు KNPSనాయకులు
రామకృష్ణ, నరసరావుపేట, PDM,.
ఇండ్లపై NIA పోలీసులు దాడులు ఈ రోజు ఉదయం 6 గంటల నుండి చేస్తున్నారు. ఈ దాడులను పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది,వెంటనే ఈ అక్రమ దాడులను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తోంది….ప్రజాస్వామిక వాదులు, మేధావులు అందరు ఈ నిర్బంధ దాడులను ఖండించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది…
1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు,ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
మరో వైపు ఎన్ ఐ ఏ సోదాలపై ఓ ప్రకటన విడుదల చేసింది.
NIA ప్రెస్ రిలీజ్
ముంచింగ్‌పుటు సీపీఐ (మావోయిస్ట్) కుట్ర కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిపిన దాడుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం ఒకరిని అరెస్టు చేసి ఆయుధాలు, నగదు, నేరారోపణలు రుజువు చేసే వస్తువులను స్వాధీనం చేసుకుంది.
రెండు రాష్ట్రాల్లోని 62 ప్రదేశాలలో బహుళ దాడులు నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాకు చెందిన ప్రగతిశీల కార్మిక సమాక్య (PKS) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్ర నరసింహులు అనే వ్యక్తిని అరెస్టు చేసి ఘటనా స్థలం నుంచి 14 రౌండ్లతోపాటు ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలోని ఒక ప్రాంగణంలో 13 లక్షలు, ఇతర ప్రాంతాల నుంచి మావోయిస్టు సాహిత్యం, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, పలనాడు, విజయవాడ, రాజమండ్రి, ప్రకాశం, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి డిఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, కడప సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 53 ప్రాంతాల్లో ఈరోజు దాడులు జరిగాయి. తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్, హనుమకొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని 9 చోట్ల సోదాలు జరిగాయి.
పౌర హక్కుల కమిటీ (CLC), అమరుల బంధు మిత్రుల సంఘం (ABMS), చైతన్య మహిళా సంఘం (CMS), కుల నిర్మూలన పోరాట సమతి (KNPS), పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM), ప్రగతిశీల కార్మిక సమక్య (PKS), ప్రజాకళా సంఘాలు ఉన్నాయి. మండలి (PKM), విప్లవ రచయితల సంఘం (RWA) లేదా విప్లవరచయితలసంఘం (VIRASAM), మానవ హక్కుల వేదిక (HRF), రాజకీయ ఖైదీల విడుదల కోసం కమిటీ (CRPP), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (IAPL) తదితర సంస్థలతో మావోయిస్టు పార్టీకి ఉన్న సంబంధాలు, ఈ రోజు అరెస్టు చేసిన వ్యక్తీని విచారించడం వల్ల బైటపడే అవకాశం ఉందని భావిస్తున్నాం.
మావోయిస్టుల కదలికలు, ముంచింగ్‌పుట్ ప్రాంతంలో మావోయిస్టు సాహిత్యం రవాణాకు సంబంధించిన సమాచారం ఆధారంగా 2020 నవంబర్ 23న ASR జిల్లా ముంచింగ్‌పుటు పోలీసులు కేసు నమోదు చేశారు. పాంగి నాగన్న అనే వ్యక్తి మావోయిస్టు విప్లవ సాహిత్య పుస్తకాలు, మందులు, రెడ్ కలర్ బ్యానర్ క్లాత్, ఎలక్ట్రికల్ వైర్ బండిల్స్, నిప్పో బ్యాటరీలు , కరపత్రాలను మావోయిస్టు కార్యకర్తలకు అందజేయడానికి తీసుకువెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పాంగి నాగన్నను సమగ్రంగా విచారించగా, ఈ వస్తువులను ప్రజాసంఘాల నాయకులు అతనికి అందజేసినట్లు తేలింది.
అయితే NIA ఆరోపణలను ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రగశీల కార్మిక సమైక్య లో పనిచేస్తున్న చంద్ర నరసింహులు వద్ద ఆయుధాలు దొరికాయని ఎన్ఐఏ పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, కుట్రపూరితమైన కేసు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని, రెండు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై NIA దాడులకు దిగడం అప్రజాస్వాకమైన చర్య అని ప్రజా సంఘాలు మండిపడ్డాయి.