తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చాలాకాలంగాణ పసుపు రైతులు చేస్తున్న ఆందోళనలకు ఇక ముగింపు పడనుంది. త్వరలోనే తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చాలాకాలంగాణ పసుపు రైతులు చేస్తున్న ఆందోళనలకు ఇక ముగింపు పడనుంది. త్వరలోనే తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోడీ (PM MODI) ప్రకటించారు.
ఈ రోజు (ఆదివారం )మహబూబ్ నగర్ లో జరిగిన ప్రజాగర్జన సభలో ప్రధాని మాట్లాడుతూ, ములుగు లో సమ్మక్క, సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ హామీ విభజనచట్టంలో ఉంది.
సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని మోడీ అన్నారు. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరముందన్న మోడీ, నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించామని, తెలుగు రాష్ట్రాలకు మహారాష్ట్రకు మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయన్నారు.
ప్రధాని ప్రకటించిన నూతన ప్రాజెక్టుల్లో 5 మెగా ఫుడ్ పార్క్స్, 4 ఫిషింగ్ క్టస్టర్స్ , నిజామాబాద్‌లో పసుపు బోర్డు , 900 కోట్లతో సమక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ, ఇన్స్‌స్టిట్యూట్ ఆప్ ఎమినెన్స్‌గా హెచ్‌సీయూ స్థాయిని పెంచడం లాంటి వి ఉన్నాయి.