HomeCinemaInternational

తన్నుకున్న సినీ తారలు.. ఆరుగురికి గాయాలు, పలువురు ఆసుపత్రి పాలు

తన్నుకున్న సినీ తారలు.. ఆరుగురికి గాయాలు, పలువురు ఆసుపత్రి పాలు

సినీ తారలు తిట్టుకోవడం, విమ్నర్శలు చేసుకోవడం ఇప్పటి వరకు చూశాం కానీ తన్నుకోవడం మాత్రం బాహూషా ఇప్పుడే జరిగి ఉంటుంది. సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ లో రెండ

పాక్ జట్టుకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ బిర్యానీ
బెంగళూరులో డబుల్ సూపర్ ఓవర్… టీమిండియా గెలుపు
ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన ఇండియా… ఆసిస్ పై గెలుపు

సినీ తారలు తిట్టుకోవడం, విమ్నర్శలు చేసుకోవడం ఇప్పటి వరకు చూశాం కానీ తన్నుకోవడం మాత్రం బాహూషా ఇప్పుడే జరిగి ఉంటుంది. సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ లో రెండు జట్ల మధ్య జరిగిన వాగ్వివాదం, గొడవగా మారి కొట్టుకునేదాకా వెళ్ళింది. ఈ కొట్లాటలో ఆరుగురు సినీ తారలు గాయాలపాలవగా వారిని ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది.

2023లో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, వారి అభిమానులలో క్రికెట్ ఫీవర్‌ను రేకెత్తించడానికి దేశంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) నిర్వహించింది. అనేక మంది ప్రముఖ్గ సినీ తారలు పాల్గొన్న ఈ మ్యాచ్ గొడవ , తన్నులాటలతో అర్ధాంతరంగా ముగిసిపోయింది.

శుక్రవారం రాత్రి ఢాకాలోని షహీద్ సుహ్రావర్ది ఇండోర్ స్టేడియంలో జరిగిన CCL మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య హింసాత్మక పోరాటం జరిగింది. ఆరుగురు గాయపడ్డారు. నివేదికల ప్రకారం, అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా చిత్రనిర్మాత ముస్తఫా కమల్ రాజ్, నటుడు దీపాంకర్ దీపన్ టీంల‌ మధ్య గొడవ జరిగింది. ఈ మాటల వాగ్వాదం కొద్ది సేపటికే కుస్తీ పోటీగా మారింది, ఆటగాళ్లు ఒకరి గల్లాలు ఒకరు పట్టుకున్నారు.చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్‌లతో ఒకరినొకరు కొట్టుకున్నారు.


ఓ టీం కు చెందిన బ్యాట్స్‌మెన్ ఫోరు కొట్టినా అంపైర్ బౌండరీ ఇవ్వలేదంటూ, బ్యాట్స్ మ్యాన్ ఔట్ అయ్యాడంటూ ప్రకటించడంతో ఈ గొడవ మొదలయ్యింది. అంపైర్ అమ్ముడు పోయాడంటూ మరో జట్టు సభ్యులు గొడవ ప్రారంభించారు. ఈ అగ్లీ ఫైట్ లో ఆరుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలవగా, సెమీ-ఫైనల్ దశకు ముందే టోర్నమెంట్ రద్దు చేయబడింది.

మరొక వీడియోలో, నిర్మాత ముస్తఫా కమల్ రాజ్, నటుడు షరీఫుల్ రాజ్ పై నటి రాజ్ రిపా తీవ్రమైన ఆరోపణలు చేయడం కనిపించింది. తన కెరీర్‌కు ఏదైనా జరిగితే కమల్ రాజ్ బాధ్యత వహించాలని ఆమె పేర్కొంది. అతని టీం సభ్యులు తనపై వాటర్ బాటిళ్లు విసిరార‌ని ఆరోపించింది.
బంగ్లాదేశ్ మీడియా నివేదికల‌ ప్రకారం, దీపంకా జట్టు సభ్యుడు, నటుడు మోనిర్ హొస్సేన్ షిముల్, తమ ప్రత్యర్థి తమను ఓడించడానికి బయటి వ్యక్తులను తీసుకువచ్చారని ఆరోపించారు. “వారు మాపై దాడి చేయడం ప్రారంభించిన వెంటనే బయటి వ్యక్తులు రంగంలోకి దిగి మాపైఉ దాడి చేశారు. ఇది ఎలాంటి సీసీఎల్ మ్యాచ్?’’ అని ఆయన అన్నారు.