తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు మాట వినని సొంత పార్టీ నేతలు నాశనం కావాలని ఇతర రాష్ట్రాలకు పోయి పూజలు చేస్తున్నడు గణేష్ మండపాల తాయిలాల పేర
తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు
మాట వినని సొంత పార్టీ నేతలు నాశనం కావాలని ఇతర రాష్ట్రాలకు పోయి పూజలు చేస్తున్నడు
గణేష్ మండపాల తాయిలాల పేరుతో ఒక్క అసెంబ్లీకి రూ. 3 కోట్లు పంపిన కేసీఆర్
దళిత బంధు, బీసీ బంధు ఇస్తామంటూ ఇతర పార్టీల నేతలను లొంగదీసుకునేందుకు బీఆర్ఎస్ కుట్ర
బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి పోయినోళ్లంతా తమ తప్పు తెలుసుకుని మథనపడుతున్నారు
కేసీఆర్ ఎన్ని వేషాలేసినా…ఎంత ఖర్చు పెట్టినా మళ్లీ అధికారంలోకి రావడం కల్ల
గ్రూప్ 1 పరీక్షల రద్దుకు ముమ్మాటికీ కేసీఆరే బాధ్యుడు
నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందే…
నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే
రూ.1.6 లక్షల నిరుద్యోగ భ్రుతి ఇవ్వకపోతే నిరుద్యోగ యువత కేసీఆర్ ను క్షమించబోదు
కాంగ్రెస్ నుండి గెలిచే వాళ్లంతా కేసీఆర్ కు ఏటీఎం లాంటి వాళ్లే
కులాల మధ్య కుంపట్లు పెట్టి కాంగ్రెస్ గెలవాలనుకుంటోంది
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పుల చెరిగిన బండి సంజయ్ కుమార్
పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా మొక్కలు నాటిన బండి సంజయ్
ప్రచార రథాన్ని ప్రారంభించిన బండి
కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో గణేష్ మండపాలను దర్శిస్తున్న సంజయ్
ముఖ్యమంత్రి కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇతర పార్టీల నేతలనే కాకుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. గణేష్ మండపాలకు తాయిలాల పేరుతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 3కోట్లు ఇస్తూ యువతను బీఆర్ఎస్ వైపు ఆకర్షించేందుకు కుట్ర చేశారని దుయ్యబట్టారు. దళిత బంధు, బీసీ బంధు ఇస్తామంటూ బీజేపీ సహా ఇతర పార్టీల నేతలను కూడా బీఆర్ఎస్ లోకి వచ్చేలా ఆశ పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఎన్ని వేషాలేసినా, ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. గ్రూప్ 1 పరీక్షల రద్దుకు ముమ్మాటికీ కేసీఆర్ బాధ్యత వహించి నిరుద్యోగులకు క్షమాప చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు నష్టపోయిన ప్రతి నిరుద్యోగికి రూ. లక్ష పరిహారం ఇవ్వాలని, అట్లాగే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో నిరుద్యోగికి రూ.లక్షా 60 వేల నిరుద్యోగి భ్రుతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేసీఆర్ కు ఓట్లు అడిగే హక్కే లేదని, నిరుద్యోగులు క్షమించబోరన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి గెలవాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ నుండి గెలిచే వాళ్లంతా కేసీఆర్ కు ఏటీఎం మిషన్ లాంటివాళ్లేనని, ఎప్పుడంటే అప్పుడు వాళ్లను బీఆర్ఎస్ లోకి తీసుకోవడం ఖాయమన్నారు.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం వద్ద బండి సంజయ్ మొక్కలు నాటారు. అట్లాగే బీజేపీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు…
ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి. నవజ్వోల భారత మహానాయకుడు. మహోన్నతమైన ఈ శతాబ్దపు రుషి. గొప్ప రచయిత. పాత్రికేయుడు. రాజనీతిజ్ఝుడు. ఏకాత్మతా మానవతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నతుడు.
ఈ దేశంలో భోజనం లేకుండా ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. అధికారమే పరమావధిగా కాకుండా సేవే లక్ష్యంగా రాజకీయాలను కొనసాగించాలని చెప్పిన గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా స్మరిస్తూ మొక్కలు నాటడం ఆనందంగా ఉంది.
దేశ రక్షణ కోసం నిరంతరం సిద్ధంగా ఉండాలని భారత సైన్యంతోపాటు జన సంఘ్ కార్యకర్తలను కూడా పాకిస్తాన్ తో జరిగిన యుద్దానికి పంపిన గొప్ప దేశభక్తుడు.
దేశ ఆర్ధిక విధానం ఎలా ఉండాలో ఆనాడే చాలా స్పష్టంగా చెప్పిన మహనీయుడు. ‘‘ప్రభుత్వాలు వ్యాపారాలు చేయొద్దు.. ప్రజల ప్రాణ, ధన, మానాన్ని రక్షించడమే ప్రభుత్వ ధర్మం’’ అని చెప్పిన రాజనీతిజ్ఝుడు.
దీన్ దయాళ్ సిద్దాంతాలను, ఆశయాలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీగారిదే. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇందుకు నిదర్శనం.
రాజు బలవంతుడై దేశాన్ని అదుపులో పెట్టి చక్కగా పాలిస్తున్నప్పుడు దొంగలు, దోపిడీదారులు, హంతకులు, అవినీతిపరులు, మోసగాళ్లంతా ఒక్కటై కుట్రలు చేస్తారు. సమాజంలో అసహనం పెరిగిపోతోందని ప్రచారం చేస్తారని దీన్ దయాళ్ ఉపాధ్యాయ రాసిన ‘సామ్రాట్ చంద్రగుప్త’ పుస్తకంలి మాటలు ఈరోజు మళ్లీ గుర్తుకొస్తున్నాయి
చిట్టచివరి వ్యక్తిదాకా ప్రగతి ఫలాలు అందాలని దీన్ దయాళ్ చెప్పిన మాటలను అక్షర సత్యాలుగా అమలు చేస్తూ అవినీతి మరక లేకుండా జనరంజకంగా పాలిస్తున్న నరేంద్ర మోదీగారి ప్రభుత్వాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నయ్. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ వంటి మోసపూరిత ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై మోదీగారిపై దుష్ప్రచారం చేస్తున్నాయి.
అయినా వెనుకంజ వేయకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బాటలో నడుస్తూ వ్యక్తి స్వేచ్ఛ, ప్రజా స్వామ్యాన్ని గౌరవించేదే రామరాజ్యం అని నిరూపిస్తూ ధర్మబద్ద పాలన కొనసాగిస్తున్న నరేంద్రమోదీ గారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ నిజమైన వారసుడు.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పాటు పడాలని, మోదీగారు అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు అందేలా చూడాలని కోరుకుంటున్నా.
కరీంనగర్ లో చిల్లర రాజకీయాలైనయ్. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో లక్షల ఆశ చూపి ఇతర పార్టీల నాయకులను బీఆర్ఎస్ లోకి లాగుతున్నరు. దళిత బంధు, బీసీ బంధు పైసలిస్తామని ఆశ చూపి లొంగదీసుకోవాలనుకుంటున్నరు. ఒక్కటి మాత్రం నిజం… ఆత్మగౌరవం ఉన్నోళ్లు, ధర్మం కోసం పోరాడే వాళ్లు మళ్లీ బీజేపీలోకి వస్తారు. కొందరు ఇప్పటికే తమ తప్పును తెలుసుకుని వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
కేసీఆర్ పాలనను పూర్తిగా గాలికొదిలేశాడు. చివరకు నిరుద్యోగుల జీవితాలను కూడా ఫణంగా పెట్టిండు. పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేకపోతున్నడు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయలేదు. నోటిఫికేషన్లకే పరిమితమైంది. పరీక్షలు నిర్వహించడం కూడా చేతగాదు. రెండు సార్లు రద్దు చేసి లక్షలాది మంది నిరుద్యోగులను రోడ్డున పడేసింది. తినడానికి తిండి లేకపోయినా పిల్లల కోసం అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ ఇప్పిస్తే… పరీక్షలు రద్దుతో అల్లాడుతున్నరు.
టెన్త్, ఇంటర్మీడియట్, గురుకుల పరీక్షలను నిర్వహించలేని అసమర్ధత ప్రభుత్వమితి. ఎవరైనా ప్రశ్నించినా, ఉద్యమించినా కేసుల పాల్జేస్తున్నరు.
గ్రూప్ 1 పరీక్ష రద్దుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యత. నైతిక బాధ్యత వహించాలి. నిరుద్యోగులందరికీ కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ప్రతి నిరుద్యోగికి రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలి. దీంతోపాటు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో నిరుద్యోగికి రూ.లక్షా 60 వేల భ్రుతి ఇవ్వాలి. నిరుద్యోగ భ్రుతి ఇచ్చిన తరువాతే ఓట్లు అడగాలి.
కేసీఆర్ పెద్ద కుట్రదారుడు. ఎక్కడా ఆధారం లేకుండా వినాయక మండపాల పేరిట ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 3కోట్లు పంపారు. ప్రతి వినాయక మండపానికి వేల రూపాయలు ఖర్చు చేసి యువతను బీఆర్ఎస్ వైపు మళ్లించుకునేందుకు దొంగ వేషాలు వేస్తున్నడు. విఘ్నేశ్వరుడు చాలా పవర్ ఫుల్.
కేసీఆర్ చేసినవన్నీ తాంత్రిక పూజలే. తన మాట వినని వాళ్లు నాశనం కావాలని కోరుకునే వాళ్లే. తాంత్రిక పూజల్లో సీఎం పవర్ ఫుల్… ఇతర రాష్ట్రాలకు పోయి తాంత్రిక పూజలు చేస్తున్నడు. సొంత పార్టీలో కూడా మాట వినని వాళ్లు నాశనం కావాలని పూజలు చేస్తున్నడు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబాలను, మీ భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను కోరుతున్నా. ఒక్కటి గుర్తుంచుకోవాలి… ఇతరులు నాశనం కావాలని కోరుకునే వాళ్లే చివరకు నాశనమైపోతారు..
కేసీఆర్ ఎంత ఖర్చు పెట్టినా… ఎన్ని క్షుద్ర పూజలు చేసినా మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు ఏటీఎం లాంటిది… కాంగ్రెస్ లో గెలిచిన వాళ్లంతా ఎన్నికల తరువాత వెళ్లేది బీఆర్ఎస్ లోకే. కాంగ్రెస్ పార్టీకి ప్రజల కంటే కులాలపైనే ఎక్కువ శ్రద్ధ… కులాల మధ్య కుంపట్లు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది.
మందికి పుట్టినోడే నావోడని అనుకునే టైపు కేసీఆర్… ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితి లేదు… ఈసారి కేసీఆర్ పాలనను పాతరేసేందుకు సిద్ధంగా ప్రజలున్నారు. బీజేపీ నిత్యం ఉండేది ప్రజల్లోనే… ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కార్యకర్తలపై కేసులు పెట్టి వాళ్ల ఇండ్లు కూల్చేసే దుర్మార్గాలకు కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతోంది. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడి బీజేపీ కార్యకర్తలను బీఆర్ఎస్ లోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. ఆ పార్టీలోకి వెళ్లిన వాళ్లంతా తప్పును తెలుసుకుని మథనపడుతున్నారు. ఏనాడైనా వాళ్లంతా బీజేపీలోకి వస్తారనే నమ్మకం ఉంది.