HomeTelanganaCrime

డ్రగ్స్ కేసు: ఐదుగురు అరెస్ట్, టాలీవుడ్ లో ప్రకంపనలు, ‘బేబీ’ మూవీ టీం కు పోలీసుల నోటీసులు

డ్రగ్స్ కేసు: ఐదుగురు అరెస్ట్, టాలీవుడ్ లో ప్రకంపనలు, ‘బేబీ’ మూవీ టీం కు పోలీసుల నోటీసులు

హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా అది టాలీవుడ్ తో లింకై ఉండటం మరింత ఆందోళనకలిగిస్తోంది. తాజాగా హైదరాబా

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పంపిణీ పైన మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
హైదరాబాద్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర‌ కమిటీ నాయకుడి అరెస్ట్ ?
నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం – తొమ్మిది మంది సజీవ దహనం

హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా అది టాలీవుడ్ తో లింకై ఉండటం మరింత ఆందోళనకలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ పోలీసులు, నార్కోటిక్స్ బ్యూరో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సినీ నిర్మాత, మాజీ ఎంపీ కుమారుడు సహా మొత్తంఐదుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ అంశంపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విలేకరుల మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన బేబీ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “సినిమాలో డ్రగ్స్ ఎలా ఉపయోగించవచ్చో’ బేబీ’ మూవీలో చూపించిన సన్నివేశాల లాగానే ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్‌లో రైడ్ చేసినప్పుడు ఉన్న సీన్ ఉందని సీవీ ఆనంద్ ఫైర్ అయ్యారు. అలాంటి వాటిని సినిమాల్లో చూపించవద్దని చిత్ర పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ విషయంలో బేబీ టీమ్‌కు నోటీసులు జారీ చేస్తామని, ఇక నుంచి డ్రగ్స్‌కు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశమనంతరం బేబీ మూవీ యూనిట్ కు నోటీసులు జారీ చేశారు.

టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్లంతా బయటకు వస్తున్నారని, తాజాగా మాదాపూర్‌లో పోలీసులు దాడి చేసిన కేసులో మొత్తం డ్రగ్స్ బెంగళూరు నుండి వచ్చాయని సీవీ ఆనంద్ తెలిపారు. ”ఒక ప్రత్యేక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీసా గడువు ముగిసినా కొందరు నైజీరియన్లు దేశంలో ఉన్నారు. డ్రగ్స్ కోనుగోలు చేస్తున్న వారిలో వరంగల్ చెందిన వ్యక్తి ఉన్నారని గుర్తించాము. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు. ఇలా విక్రమాలు జరుపుతున్న మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ రావు‌ని అరెస్ట్ చేశాము. బెంగళూరు (Bangalore)లో 18 మంది నైజీరియన్స్‌ని గుర్తించాము. ఈ కేసులో వినియోగదారుడిగా ఉన్న నవదీప్ (Navdeep).. ప్రస్తుతం పరారీలో ఉన్నారు’’ అని ఆయన తెలిపారు.

కాగా బేబీ మూవీ యూనిట్ కు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ మూవీ డైరెక్టర్ సాయి రాజేశ్ కిఅమిషనర్ సీవీ ఆనంద్ ను కలిశారు. కథలో భాగంగానే ఆ డ్రగ్స్ సన్నివేశాలను పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు.

మరో వైపు తాను పరారీలో ఉన్నానని, జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నటుడు నవదీప్ ట్వీట్ చేశారు. సీపీ చెప్పిన నవదీప్ ను తాను కానని ఆయన స్పష్టం చేశారు.