HomeNational

ఉదయనిధి వ్యాఖ్యలపై ఇంత గొడవెందుకు, శపిస్తే సరిపోతుంది కదా !

ఉదయనిధి వ్యాఖ్యలపై ఇంత గొడవెందుకు, శపిస్తే సరిపోతుంది కదా !

సనాతన ధర్మం కూడా కరోనా, డెంగీ, మలేరియా లాగా ప్రమాదకరమైనదని, దానిని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్న మాటలు హిందుత్వ్ వాదుల్లో ఆగ్ర

I.N.D.I.A కూట‌మి కీలక నిర్ణయాలు
తెలంగాణ బీజేపీకి షాక్ – మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా
ఏప్రెల్ లో లోక్ సభ ఎన్నికలు – ‍ స్పష్టం చేసిన కిషన్ రెడ్డి

సనాతన ధర్మం కూడా కరోనా, డెంగీ, మలేరియా లాగా ప్రమాదకరమైనదని, దానిని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్న మాటలు హిందుత్వ్ వాదుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. బీజేపీ నాయకులతో సహా, హిందుత్వ నాయకులంతా వరసపెట్టి ఉదయనిధిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తమ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఇండియా కూటమి లోని పలువురు నాయకులు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

ఇక సన్యాసులు, స్వామీజీలు, బాబాలు కూడా ఉదయనిధిపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ఉదయనిధికి రాజకీయ జీవితం లేకుండా శపించాలని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. మరి శపించాల్సింది ఎవరనేది ఆయన చెప్పలేదు. అక్కడితో ఆయన ఆగలేదు. “నీ తల్లి దుర్గా మాత ఆలయాలను దర్శించుకుంటుంది… ధర్మాన్ని విమర్శిస్తే నీ తల్లిని దూషించినట్టే” అని ఆయన ఉదయనిధిని ఉద్దేశించి అన్నారు. ఇది మైనారిటీల ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని కించపర్చడం నీచమైన చర్య అని విమర్శించారు.

అయినా శక్తివంతులైన ఈ స్వామీజీలూ, బాబాలు శపిస్తే ఉదయనిధి రాజకీయ జీవితం, వీలైతే జీవితమే లేకుండా అయిపోయే పరిస్థితి ఉన్నప్పుడు, ఆయనకు శాపం పెట్టి వాళ్ళ శక్తిని నిరూపించుకోకుండా రోజూ మీడియాలో , సోషల్ మీడియాలో ఈ విమర్శలు, ఆరోపణలు అవసరమా?