HomeTelangana

కరెంట్ బిల్లు బాకీ…ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ కట్

కరెంట్ బిల్లు బాకీ…ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ కట్

•ఇబ్బంది పడుతున్న ప్రజలు.. •బడ్జెట్ లేకనే విద్యుత్ బిల్లు చెల్లించలేదని అధికారుల సమాధానం… కోదాడ, ఆగస్టు 29(నినాదం న్యూస్): సూర్యాపేట జిల్లా కోద

బట్టబయలైన 250 కోట్ల భారీ కుంభకోణం
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
గద్దర్ అన్న యాదిలో సభ ను విజయవంత చేయండి

•ఇబ్బంది పడుతున్న ప్రజలు..

•బడ్జెట్ లేకనే విద్యుత్ బిల్లు చెల్లించలేదని అధికారుల సమాధానం…

కోదాడ, ఆగస్టు 29
(నినాదం న్యూస్): సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామం లోని ప్రాథమిక వైద్యశాలకు గత 18 నెలలుగా కరెంటు బిల్లు బాకీ ఉండడంతో అధికారులు ఎవరు స్పందించకపోవడంతో విసుగు చెందిన విద్యుత్ అధికారులు మంగళవారం కరెంట్ కట్ చేశారు. దీంతో వైద్య సిబ్బంది ఇన్వర్టర్ సహాయంతో వైద్యం సేవలు కొనసాగిస్తున్నారు. 18 నెలలుగా సుమారు లక్షన్నర బాకీ ఉందని, ఎన్నిసార్లు విన్నవించుకున్న సంబంధిత అధికారులు ఎవరు స్పందించక పోవడంతో విద్యుత్ ను నిలిపివేశామని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా వైద్యాధికారి నిరంజన్ మాట్లాడుతూ.. బడ్జెట్ లేకపోవడంతో విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోయామని అన్నారు. ఇదే విధంగా అనేక ప్రాథమిక వైద్యశాలలకు విద్యుత్ బిల్లులు చెల్లించ లేదని అన్నారు. ఒకవేళ విద్యుత్ అదేవిధంగా నిలిపివేస్తే వ్యాక్సిన్ లను వేరే వైద్యశాలకు తరలించాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి వలన కొన్ని రోజుల వరకు విద్యుత్ ఇచ్చిన, విద్యుత్ బిల్లు చెల్లించకపోతే మరల విద్యుత్ అధికారులు వైద్యశాలలకు ఎప్పుడో ఒకప్పుడు అయినా నిలిపివేస్తారు. కావున ప్రజలకు అత్యవసర వైద్యం అందడం కోసం ఏర్పాటుచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించి వాటికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.