వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దీక్షను పోలీసులు భగ్నం చే
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి, అరెస్ట్ చేసి, కేజీహెచ్‌కు తరలించారు. ఆ సమయంలో పోలీసులతో కేఏ పాల్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఓ సిఐ కాలర్ పట్టుకున్నాడు. వారితో దురుసుగా ప్రవర్తించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు వైద్యం అవసరం లేదని కేకలు వేశారు. పోలీసులు బలవంతంగా కేఏ పాల్ ను కేజీహెచ్ లో చేర్పించగా ఆయన పోలీసుల కళ్లుగప్పి కేజీహెచ్ నుంచి తప్పించుకొని తన వాహనంలో మళ్లీ నిరాహార దీక్షా శిభిరానికి చేరుకున్నారు.
అక్కడ తన వాహనంలో నిలబడి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలన్నింటిపై నిప్పులు చెతిగారు. తాను తప్ప ఇంకెవ్వరూ స్టీల్ ప్లాంట్ కోసం నిజాయితీగా పోరాడటం లేదని చెప్పుకొచ్చారు.
”నా దీక్షనే భగ్నం చేస్తారా ? నన్నే అరెస్టు చేస్తారా ? ఎంత ధైర్యం ? నేను తిట్లు స్టార్ట్ చేశానంటే ఒక్కొక్కరు గుండె ఆగి చస్తారు. సీఐ, ఎస్సై లాంటి బచ్చాగాళ్ళతో నాకేంటి డీజీపీతోనే చూసుకుంటా …ఇక్కడ ఎవరితో డీల్ చేస్తున్నారో మీకు తెలుస్తుందా ? కే ఏ పాల్ ఇక్కడ…” అని వార్నింగ్ ఇచ్చారు కేఏ పాల్.
ఈ సీఐ, ఎస్ఐ బచ్చా గాళ్ళతో నాకేం పని..నేను తిట్టడం స్టార్ట్ చేసానంటే..గుండె ఆగి చస్తారు.. – కేఏ పాల్#KAPaul #Visakhapatnam #VisakhaSwachhSankalpam #Vizag #VizagSteelPlant #AndhraPradesh #SteelPlantPrivatization #NTVTelugu pic.twitter.com/L4MZeW15XH
— NTV Telugu (@NtvTeluguLive) August 29, 2023