HomeTelanganaPolitics

రేఖానాయక్ వ్యవహారంలో… అత్తమీద కోపం అల్లుడి మీద చూపించారా ?

రేఖానాయక్ వ్యవహారంలో… అత్తమీద కోపం అల్లుడి మీద చూపించారా ?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోస‍ం కేసీఆర్ ప్రకటించిన బీఆరెస్ అభ్యర్థుల లిస్ట్ లో ఖానాపూర్ (Khanapur) సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు కాకుండా కేటీఆర్ స్నేహితుడు

మంత్రి హరీశ్ రావుపై బీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన ఆరోపణలు
BRS కార్యాలయాన్ని కూల్చేసిన అధికారులు
దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టిన వజ్రోత్సవాలు

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోస‍ం కేసీఆర్ ప్రకటించిన బీఆరెస్ అభ్యర్థుల లిస్ట్ లో ఖానాపూర్ (Khanapur) సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు కాకుండా కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ పేరు ఉండటం పట్ల రేఖానాయక్ రగిలిపోతున్నారు. అభ్యర్థుల పేర్లు ప్రకటన వచ్చిన రోజే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆసిఫాబాద్ టికెట్‌ కోసం శ్యామ్ నాయక్, ఖానాపూర్ టికట్ కోసం రేఖానాయక్ దరఖాస్తు చేసుకున్నారు.

అంతకుముందే రేఖానాయక్ కల్వకుంట్ల కవిత, హరీశ్ రావులతో మంతనాలు జరిపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆమె తాను ప్రస్తుతం బీఆరెస్ లో ఉన్నానని, త్వరలో కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటించారు. ఆమె అలా ప్రకటించిన కొద్ది సేపట్లోనే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గా పనిచేస్తున్న రేఖానాయక్ అల్లుడు శరత్‌చంద్ర పవార్ ( Sarath Chandra) ను ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీకి బదిలీ చేసింది. ఆయన స్థానంలో గుండేటి చంద్రమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, తన అత్త మీద‌ కోపం ఉంటే దాన్ని తనపై చూపడమేంటి..? అని శరత్ చంద్ర తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడ్డారట.

ఈ రోజు పోలీసు శాఖలో ఇతర ట్రాన్స్ ఫర్లు ఏమీ లేకుండా ఇదొక్కటే ఉండటం గమనార్హం.