HomeTelanganaCrime

కాంగ్రెస్ తరపున ‘నాటు నాటు’ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ … ఏ నియోజక వర్గమో తెలుసా?

కాంగ్రెస్ తరపున ‘నాటు నాటు’ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ … ఏ నియోజక వర్గమో తెలుసా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రతి సీటు కు ఇద్దరికన్నా ఎక్కువగా అప్లై చ

కాంగ్రెస్ లో సెకండ్ లిస్ట్ చిచ్చు…రాజీనామాలు, ఏడుపులు, శాపనార్దాలు
సీఎంకు కృతజ్ఞతలు తెలిపినఅమర జవాన్ కుటుంబం
ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రతి సీటు కు ఇద్దరికన్నా ఎక్కువగా అప్లై చేస్తున్నారు. అత్యధికంగా ఇల్లందు నియోజకవర్గానికి 38 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ ఎనిమిది రోజుల పాటు కొనసాగింది. దాదాపు వెయ్యి మందికిపైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యం లో ప్రముఖ సింగర్ , RRR మూవీలో నాటు నాటు సాంగ్ తో పాపులర్ అయిన రాహుల్ సిప్లి గంజ్ కూడా కాంగ్రెస్ తరపున అసెంబ్లీ బరిలో దిగేందుకు రెడీ అయిపోయారు. హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. గోషామహల్ లో బలమైన అభ్యర్థి, సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తో పోటీ పడేందుకు రాహుల్ సిద్దమైపోయారు.

రాహుల్ ను కాంగ్రెస్ నుంచి పోటీలో దించాలని రేవ౦త్ రెడ్డి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్కార్ వేదిక మీద పాటపాడిన రాహుల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు భారీ వెల్కం చెప్పారు. రేవంత్ ఆయనకు సన్మానం కూడా చేశారు.
కాగా, రాహుల్ సిప్లిగంజ్ తొలుత యూట్యూబర్‌గా లోకల్ సాంగ్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అనంతరం సినిమాల్లో అవకాశాలు రావడంతో అనేక హిట్ సాంగ్స్ పాడి సక్సెస్ అయ్యాడు. ఇప్పటి వరకు దాదాపు 50కి పైగా సినిమాల్లో రాహుల్ పాడారు. అంతేకాదు.. స్టార్ మాలో ప్రసారమైన బిగ్‌బాస్ షో 3 విజేతగానూ నిలిచారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘‘నాటు నాటు సాంగ్’’కు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ లభించింది. ఈ పాటను పాడిన రాహుల్.. ఆస్కార్ వేదికపై అతిరథ మహారథుల మధ్య పాడారు.