HomeNational

చదువుకున్న వారికే ఓటేయండన్న టీచర్.. దేశద్రోహి అని మండిపడుతున్న హిందుత్వ సంఘాలు

చదువుకున్న వారికే ఓటేయండన్న టీచర్.. దేశద్రోహి అని మండిపడుతున్న హిందుత్వ సంఘాలు

ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకే ఓటు వేయాలని విద్యార్థులను కోరినందుకు తమ టీచర్ ను ఓ సంస్థ ఉద్యోగం నుంచి తీసఏసింది. ఆ టీచర్ దేశద్రోహి అందుకే అలా మాట్

‘కేటీఆర్ భయంతో అనేక మంది హీరోయిన్లు పెళ్ళి చేసుకొని పారిపోయారు’
ట్యూషన్ టీచర్ ను పొడిచి చంపిన బాలుడు
తెలంగాణ నుంచి నరేంద్రమోడీ, ప్రియాంకా గాంధీ పోటీ ?

ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకే ఓటు వేయాలని విద్యార్థులను కోరినందుకు తమ టీచర్ ను ఓ సంస్థ ఉద్యోగం నుంచి తీసఏసింది. ఆ టీచర్ దేశద్రోహి అందుకే అలా మాట్లాడాడంటూ విశ్వహిందూ పరిషత్ మండిపడింది. సోషల్ మీడియాలో హిందుత్వ సంఘాలు అతన్ని ట్రోల్ చేశాయి.

అనాకాడెమీ unacademy అనే ఆన్ లైన్ టీచింగ్ ప్లాట్ ఫామ్ లో కరణ్ సంగ్వాన్ Karan Sangwan అనే టీచర్ టెఅఛెర్ విద్యార్థుల Students కు బోధన చేస్తుంటాడు. ఒక రోజుక్లాస్ లో భాగంగా ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకే ఓటు వేయాలని విద్యార్థులకు చెప్పాడు. అది పెద్ద వివాదం అయిపోయింది. సంస్త్ర్హ అతన్ని ఉద్యోగంలోంచి తీసేసింది.

ఆ ఒక్క మాట చెప్పాడో, లేదో అతనిపై విమర్శలు తలెత్తాయి. బహుషా చదువంటే ఇష్టం లేని కొన్ని వర్గాల వారు కావాలనే అతన్ని టార్గెట్ చేసుకున్నారు. అతనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు.. ”నువ్వు క్లాసులు చెప్పే ఉపాధ్యాయుడివా? లేక కొన్ని రాజకీయ పార్టీలకు డప్పు కొట్టే సేవకుడివా?’’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. కొందరైతే కరణ్ సంగ్వాన్ దేశద్రోహి అని అందుకే చదువుకున్న వారికే ఓటు వేయాలని చెప్తున్నాడని ఆరోపణలు కూడా చేశారు. విశ్వ హిందు పరిషత్ నాయకురాలైన సాధ్వి ప్రాచి కూడా ఆ టీచర్ మీద విరుచుకపడింది.ఆ టీచర్ ఒక యాంటీ-నేషనలిస్ట్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అన్అకాడమీ ఆ ఉపాధ్యాయుడ్ని తొలగించి మంచి పని చేసిందని ట్వీట్ చేశారు.

కాగా ఆ టీచర్ కు వ్యతిరేకంగా ఒక వైపు సోషల్ మీడియాలో విద్వేషం వ్యాపిస్తున్న సమయంలోనే మరికొందరు నెటిజనులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. అనాకాడమీ కరణ్ సంగ్వాన్ ను ఉద్యోగంలోంచి తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పంధించారు. అనాకాడెమీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.

”విద్యావంతులకు ఓటు వేయమని విజ్ఞప్తి చేయడం నేరమా? ఎవరైనా నిరక్షరాస్యులైతే, వ్యక్తిగతంగా నేను అతనిని గౌరవిస్తాను. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదు. ఇది 21వ శతాబ్దం. శాస్త్ర సాంకేతిక యుగం. నిరక్షరాస్యులైన ప్రజా ప్రతినిధులు ఆధునిక భారతదేశాన్ని ఎన్నటికీ నిర్మించలేరు. ” అని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ లో కామెంట్ చేశారు.

కాగా, శనివారం నాడు తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వివాదానికి సంబంధించిన వివరాలను పంచుకుంటానని సాంగ్వాన్ చెప్పారు.

మరో వైపు సాంగ్వాన్ కు మద్దతుగా ట్విట్టర్ లో నెటిజనులు మొదలు పెట్టిన #UninstallUnacademy అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెం డింగ్ లో ఉంది.