HomeTelanganaPolitics

ఒకటి కాదు…రె‍ండు కాదు…మొత్తం 100 అబద్దాలు

ఒకటి కాదు…రె‍ండు కాదు…మొత్తం 100 అబద్దాలు

భారతీయ జనతా పార్టీ చెప్పిన 100 అబద్దాలతో కూడిన బుక్ లెట్, సీడీని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, బారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విడుదల చ

బీజేపీకి బిగ్ షాక్:బీఆరెస్ లోకి దత్తత్రేయ‌ కూతురు?
పాపం కృష్ణ మాదిగ…అంతన్నారింతన్నారు….అద్దాల మేడన్నారు… చివరకు తుస్సుమనిపించిన మోడీ
తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు – ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి

భారతీయ జనతా పార్టీ చెప్పిన 100 అబద్దాలతో కూడిన బుక్ లెట్, సీడీని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, బారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు. సోమవారం ప్రగతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది.

తెలంగాణకు , దేశానికి చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో బిజెపి ఎలా విఫలమైందో వివరిస్తూ బిఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం “బిజెపి 100 అబద్ధాలు” బుక్ లెట్, సీడీ తయారు చేసింది. ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం, జీఎస్టీ భారం, ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, అందరికీ ఇళ్లు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం వాగ్దానాలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్ సీసీఐ, వాల్మీకి బోయా ఎస్టీ రిజర్వేషన్లతో సహా బీజేపీ విఫలమైన వాగ్దానాలను ఇందులో పొందుపర్చారు.

ఈ ప్రచారం ద్వారా కేంద్రమే కాదు, తెలంగాణ బీజేపీ నేతల బండారం కూడా బట్టబయలు అవుతుంద‌ని టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌ ట్వీట్‌ చేశారు.

ఇది అద్భుత ప్రచారమని, బీజేపీని ప్రజల ముందు ఎండగట్టేందుకు ఇది చాలా దోహదం చేస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ బుక్ లెట్, సీడీ రూపొందించినందుకు BRS సోషల్ మీడియా కన్వీనర్లు క్రిశాంక్ మన్నె, దినేష్ చౌదరి, వై.సతీష్ రెడ్డి, పాటిమీడి జగన్మోహన్ రావుల కృషిని మంత్రి అభినందించారు.

BRS సోషల్ మీడియా గత నాలుగు నెలలుగా #100AbadhaalaBJP అనే ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రతిరోజూ బీజేపీ అబద్ధాలను బట్టబయలు చేస్తూ ఆ పార్టీని ఎండగడుతోంది. బిజెపిని బట్టబయలు చేస్తుంది అని క్రిషాంక్ ట్వీట్ చేశాడు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు.