దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం అనే మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ స్టోరీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. ద
దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం అనే మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ స్టోరీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు వైఎస్ జగన్ ను కీర్తిస్తూ ఈ మూవీ ఉండనుంది. ఈ మూవీలో ఆర్జీవీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు వ్యతిరేకంగా ఎక్కుపెడుతున్నట్టు సమాచారం.
ఈ మూవీలో అజ్మల్, మానస కీలక పాత్రల్లో నటిస్తుండగా, దాసరి కిరణ్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీపై ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ, వైయస్ మరణం దగ్గర నుంచి ‘వ్యూహం’ కథ మొదలవుతుందని చెప్పారు. రెండు భాగాలుగా చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. వైయస్ మరణం తరువాత జరిగిన పరిణామాలు, ఎవరెవరు ఎలాంటి వ్యూహాలు రచించారో వివరంగా చూపిస్తామన్నారు వర్మ.
”వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో చూపిస్తాం. ఆ హత్య కేసులో నిందితులను చూపిస్తా. జగన్ భార్య భారతిని దగ్గరి నుంచి చూశా. ఈ మూవీలో జగన్‌తోపాటు భారతి పాత్ర కూడా ఉంటుంది. ఈ మూవీ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అందులో ప్రధాన ఘట్టాలు సినిమాలో ఉంటాయి. నేను జగన్‌కు అభిమానిననే కానీ ఇతరులెవ్వరిపైనా నాకు ద్వేషం లేదు. జగన్‌పై నాకున్న అభిప్రాయాన్ని సినిమాగా చూపిస్తున్నా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పిలిచి అగిడినా దర్శకత్వం చేయను’’ అని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు.