HomeTelangana

బీజేపీకి కీలక నేత రాజీనామా…బీఆరెస్, బీజేపీ రెండు ఒకటేనని విమర్శ‌

బీజేపీకి కీలక నేత రాజీనామా…బీఆరెస్, బీజేపీ రెండు ఒకటేనని విమర్శ‌

బీజేపీ బండిసంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించినప్పటికీ ఆ పార్టీకి బై చెప్తున్న‌ నాయకులు ఆగడం లేదు. కర్నాటక అసెంబ్లీ

ఎన్నికలకు ముందు పెరిగిన బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలు: అమెరికా సంస్థ రిపోర్ట్
తెలంగాణలో హిందుత్వ దూకుడు తగ్గించడం, అవసరమైతే పార్లమెంటులో BRS మద్దతు పొందడం…ఇవీ ఇప్పుడు బీజేపీ లక్ష్యాలు
యూనిఫాం సివిల్ కోడ్ కు మేం వ్యతిరేకం… స్పష్టం చేసిన కేసీఆర్

బీజేపీ బండిసంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించినప్పటికీ ఆ పార్టీకి బై చెప్తున్న‌ నాయకులు ఆగడం లేదు. కర్నాటక అసెంబ్లీ ఫలితాలతో తెలంగాణలో ఊపు తగ్గి బొక్కబోర్లా పడ్డ బీజేపీకి మరో నాయకుడు గుడ్ బై చెప్పాడు. వికారాబాద్ కు చెందిన‌ మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు.

రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగిస్తున్న బీఆరెస్ కు ఎదురు నిల్చి కొట్లాడుతుందనుకున్న బీజేపీ ఆ పార్టీతో కమ్మక్కయ్యిందని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి చంద్రశేఖర్ లేఖ రాశారు. బీజేపీ బీఆరెస్ ను ఓడించి తెలంగాణకు న్యాయం చేశ్తుందని భావించి తన లాంటి అనేక మంది ఉద్యమకారులు బీజేపీలో చేరారని అయితే ఆ పార్టీ మాత్రం బీరెస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని ద్వజమెత్తారు. అందువల్లే తాను బీజేపీకీ రాజీనామా చేయాల్సి వస్తోందని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు.

కాగా, మాజీ మంత్రి చంద్రశేఖర్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.