HomeTelanganaPolitics

‘పల్లెపల్లెనా ప్రజా కోర్టులు పెడదాం… తిరగబడదాం.. తరిమి కొడదాం…’

‘పల్లెపల్లెనా ప్రజా కోర్టులు పెడదాం… తిరగబడదాం.. తరిమి కొడదాం…’

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ప్రచార ఊపు పెంచించింది. పల్లెపల్లేకూ పార్టీని తీసుకెళ్ళాలని కేసీఆర్ ప్రభుత్వంపై ప్రెఅజల్లో తిరుగుబాటు వచ్చేలా చేయాలని కాం

బీజేపీ, బీఆరెస్ మధ్య పోరాట‍ం నిజమా? లేక ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం నిజమా ?
ఖమ్మంలో బీఆర్ఎస్‌కు వరుస ఝలక్‌లు.. పార్టీ తరపున టికెట్ నిరాకరించిన గుమ్మడి నర్సయ్య కుమార్తె!
మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ఓడిపోతుందని తెలిసీ ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ప్రచార ఊపు పెంచించింది. పల్లెపల్లేకూ పార్టీని తీసుకెళ్ళాలని కేసీఆర్ ప్రభుత్వంపై ప్రెఅజల్లో తిరుగుబాటు వచ్చేలా చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. అందుకోసం పల్లెపల్లెనా ప్రజాకోర్టు నిర్వహించాలని అందులో కేసీఆర్ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజా చార్జ్ షీట్ పెట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. తిరగబడదాం.. తరిమి కొడదాం… అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

ఈ రోజు బోయిన్ పల్లిలో ఉన్న గాంధీ ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ ప్రజాకోర్టు సభ నిర్వహించింది. దానికి జడ్జిగా ప్రముఖ రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యవహరించారు.

ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాలకోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన‌న నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయాలు.తొమ్మిదేళ్లలో అమలు జరగలేదని, ప్రజల హక్కులను కాలరాశాడని ఆరోపించారు. కేసీఆర్ రాజులను, నియంతలను మరిపించేలా ప్రజలపై దాడులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ”కేసీఆర్‌ను శిక్షించేందుకే ఇక్కడ ప్రజాకోర్టులో ప్రజా ఛార్జ్‌షీట్లు పెడుతున్నాం. ఈ ప్రజాకోర్టులో ప్రొఫెసర్ కంచె ఐలయ్య తీర్పు చెబుతారు.సామాజిక న్యాయం తెలంగాణలో భూతద్దం పెట్టి చూసినా కనిపించడం లేదు.అందుకోసమే ఈ ప్రజా కోర్టును ఏర్పాటు చేశాం.గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ” అని అన్నారు రేవంత్.