HomeTelangana

మతోన్మాద వ్యతిరేకి, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల మావోయిస్ట్ పార్టీ సంతాపం

మతోన్మాద వ్యతిరేకి, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల మావోయిస్ట్ పార్టీ సంతాపం

ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడ జరిగిన తొక్కిసలాటలో కిందపడి గుండెపోటు తో మరణించిన సియాసత్ పత్రిక ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృత

ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
ప్రభుత్వాల చర్చల పిలుపు మోసపూరితమైనది, అయినా మేము సిద్దమే! అయితే…. మావోయిస్టు పార్టీ ప్రకటన‌
గద్దర్ మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం

ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడ జరిగిన తొక్కిసలాటలో కిందపడి గుండెపోటు తో మరణించిన సియాసత్ పత్రిక ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ ఈ అంతిమ యాత్రలో పాల్గొవడం మూలంగా అంతిమ యాత్రలో దొర తనాన్ని ప్రదర్శంచాడానికి అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజలపై లాఠీ చార్జీ చేయడం మూలంగా ఆ తొక్కిస లాటలో జాహీరుద్దీన్ ఆలీ ఖాన్ గారు గుండె పోటుతో మరణించారని విన్నామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో తెలిపారు.

జాహిరుద్దీన్ ఆలీ ఖాన్ తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఐక్యసంఘటనలో తను ప్రధాన బాధ్యత వహిస్తూ ప్రజలను సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించాడని, జర్నలిజంలో పని చేస్తూ ఉద్యమాలకు నాయకత్వ వహించాడని జగన్ పేర్కొన్నారు. ”ముస్లింల‌పై జరుగుతున్న మతోన్మావాద దాడులకు వ్యతిరేకంగా పోరాడాడు. రాశాడు. మాట్లాడాడు. ముస్లిం ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేశాడు. మతోన్మాదం అనేది ఏ మతంలో వుండకూడదని వాదించాడు. కేంద్ర, రాష్ట్ర దళారీ పాలక వర్గాల సామ్రాజ్యవాద, కార్పోరెట్ దోపిడి అనుకూల విధానాలను నిక్కచ్ఛిక బహిర్గత పరుస్తూ తన కలంతో ప్రజలను చైతన్య పరిచాడు. పాలకుల నుండి ఒడుదొడుకులు, ఒత్తిళ్ళు ఎన్ని ఎదురైనా భయపడ లేదు. రాజీపడలేదు. లొంగి పోలేదు.” అని జగన్ తన ప్రకటనలో తెలిపారు.

ప్రజల పక్షపాతిగా, ప్రజా స్వామ్య వాదిగా, సెక్యూలరిస్టుగా చెరగని ముద్రవేశాడని, సామాజిక విప్లవం చేస్తున్న సిపిఐ (మావోయిస్టు పార్టీ)కి తన వంతు మద్దతును తెలుపుతూ స్థిరకాల సానుభూతి పరుడుగా నిలిచాడని, ప్రజా స్వామ్యవాది జహీర్ ఖాన్ కు మా పార్టీ తరుపునా వినమ్రంగా సంతాపాన్ని తెలియజేస్తున్నామని జగన్ పేర్కొన్నారు.