HomeCrimeInternational

11 ఏళ్ళ కొడుకు ఫ్లైట్ నడుపుతుంటే, పక్కనే కూర్చొని మందుకొట్టిన తండ్రి…కూలిన విమానం, ఇద్దరు మృతి

11 ఏళ్ళ కొడుకు ఫ్లైట్ నడుపుతుంటే, పక్కనే కూర్చొని మందుకొట్టిన తండ్రి…కూలిన విమానం, ఇద్దరు మృతి

18 ఏళ్ళు నిండి సివిల్ ఏవియేషన్ లో శిక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే ఫ్లైట్ నడపడానికి అర్హులు. అయితే బ్రెజిల్ లో ఓ వ్యక్తి తన్ అ11 ఏళ్ళ కుమారుడి చేతిలో

గద్దర్ వెళ్ళిపోయారు…ఆయన పాట మారుమోగుతూనే ఉంది
బాలుడి ప్రాణాలు తీసిన తల్లితండ్రుల మూఢనమ్మకం… గంగలో ముంచి చంపేశారు
బీహార్ కాల్పుల సంఘటనలో షాకింగ్ ట్విస్ట్… కాల్చింది పోలీసులు కాదట‌! మరెవరు ?

18 ఏళ్ళు నిండి సివిల్ ఏవియేషన్ లో శిక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే ఫ్లైట్ నడపడానికి అర్హులు. అయితే బ్రెజిల్ లో ఓ వ్యక్తి తన్ అ11 ఏళ్ళ కుమారుడి చేతిలో ఫ్లైట్ పెట్టి తాను హాయిగా మందుకొడుతూ కూర్చున్నాడు. దాంతో ఆ విమానం కూలిపీయి వాళ్ళిద్దరూ మరణించారు.

బ్రెజిల్ లోజూలై 29న, 42 ఏళ్ళ పరిశోధకుడు గారోన్ మైయా అనే వ్యక్తి రోండోనియా నగరంలోని నోవా కాన్‌క్విస్టాలోని కుటుంబ వ్యవసాయ క్షేత్రం నుండి బయలుదేరి, స్వంత ఫ్లైట్ లో తన కుమారుడు ఫ్రాన్సిస్కో మైయాను అతని తల్లి నివసిస్తున్న కాంపో గ్రాండే, మాటో గ్రోస్సో డో సుల్‌కి తీసుకువస్తున్నాడు.

విమానాన్ని ఏ మాత్రం నడపడం రాని తన కుమారుడి చేతిలో పెట్టాడు. కుమారుడు ఫైట్ నడుపుతుండగా మైయా బీర్ తాగుతూ, కొడుకుకు విమానాన్ని ఎలా నడపాలి అనే విషయాలపై సూచనలు ఇస్తున్నట్టు వీడియ్తోలో రికార్డ్ అయ్యింది.
ఆ విమానం బారన్ 58 అడవిలో కూలిపోవడంతో తండ్రీ కొడుకులు ఇద్దరూ మరణించారు.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. క్రాష్‌కు ముందు వీడియో చిత్రీకరించారా అని తెలుసుకోవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మిస్టర్ మైయా ఎప్పుడు వీడియో తీశారో అస్పష్టంగా ఉంది, అయితే అందులో కనిపించిన అంశాలు అతను తన, తన కొడుకు భద్రతను పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలియజేస్తుందని పరిశోధకులు తెలిపారు. విమానం కూలిపోయిన సమయంలో అతని కుమారుడే దానిని నడుపుతున్నాడా అనే దానిపై కూడా వారు ఆరా తీస్తున్నారు.

ఈ ఇద్దరు మరణంతో ఆగిపోలేదు. వీరి మరణం వల్ల మరో విషాదం జరిగింది. వీళ్ళద్దరి మరణ దుఃఖంతో మైయా భార్య, అనా ప్రిడోనిక్ ఆగస్టు 1న తన భర్త, సవతి కొడుకును సమాధి చేసిన కొన్ని గంటల తర్వాత ఆత్మహత్య చేసుకొని మరణించింది.

బ్రెజిలియన్ చట్టం ప్రకారం, హైస్కూల్ పూర్తి చేసి, నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీలో నమోదు చేసుకున్న 18 ఏళ్లు పైబడిన వ్యక్తులు మాత్రమే విమానం న‌డిపించడానికి అనుమతించబడతారు.