HomeTelangana

అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు – ముఖ్యమంత్రి ఆదేశాలు

అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు – ముఖ్యమంత్రి ఆదేశాలు

గద్దర్ మరణం తెలుగు ప్రజలనే కాక ప్రపంచవ్యాప్తంగా ఆయనను తెలిసిన ప్రతి ఒక్కరినీ ధుంఖ సముద్రంలో ముంచేసింది. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏప

సీనియర్ జర్నలిస్టు కృష్ణా రావు మృతి…కేసీఆర్ సంతాపం
గద్దర్ కన్నుమూత‌
బీహార్ కాల్పుల సంఘటనలో షాకింగ్ ట్విస్ట్… కాల్చింది పోలీసులు కాదట‌! మరెవరు ?

గద్దర్ మరణం తెలుగు ప్రజలనే కాక ప్రపంచవ్యాప్తంగా ఆయనను తెలిసిన ప్రతి ఒక్కరినీ ధుంఖ సముద్రంలో ముంచేసింది. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన్ అభౌతిక కాయాన్ని ఉంచిన హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియానికి అన్ని పార్టీల నాయకులు, ప్రజలు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌.. తెలంగాణ గర్వించే బిడ్డ అని ముఖ్యమంత్రి కేసీఆర్ రావు అన్నారు. జీవితాంతం ప్ర‌జ‌ల కోసం ఆయ‌న చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా గద్దర్‌ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుకు త‌గిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఎల్ బీ స్టేడియంలోనే గద్దర్ పార్థివదేహం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 12 గంటల తర్వాత ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర కొనసాగనుంది.ఆయన‌ అంత్యక్రియలు ఆల్వాల్‌లో గద్దర్ స్థాపించిన మహోబోధి విద్యాలయంలో జరుగుతాయి. అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్నది గద్దర్ చివరి కోరికని ఆయన తనయుడు మీడియాకు తెలిపారు.

కాగా.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై సికింద్రాబాద్‌ మీదుగా ఆల్వాల్ వరకు సాగనుంది. అనంతరం భూదేవి నగర్‌లోని గద్దర్ ఇంట్లో కొద్దిసేపు పార్థివదేహాన్ని ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.