HomeTelangana

గద్దర్ మృతికి ప్రముఖుల సంతాపం

గద్దర్ మృతికి ప్రముఖుల సంతాపం

గద్దర్ మృతికి ప్రముఖుల సంతాపం ప్రజాగాయకుడు గద్దర్ మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు ధిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్

నెయ్యి కల్తీ ప్రచారం: చంద్రబాబుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
ప్రేమించుకుందాం రా! కేసీఆర్ పై చంద్రబాబుకు లవ్ పెరిగిపోయింది
అతిపెద్ద ఎజెండాతో పవనానందుల వారు వేంచేశారు

గద్దర్ మృతికి ప్రముఖుల సంతాపం

ప్రజాగాయకుడు గద్దర్ మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు ధిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జనసేన పార్టీ, టీడీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తదితరులు గద్దర్ మ్ఱ్ఱ్తి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

”బడుగు బలహీన వర్గాల విప్లవ స్పూర్థి గద్దర్, గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల బాటే” ‍-వైఎస్ జగన్

“ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల నా సంతాపం తెలియచేస్తున్నాను. తనపాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్.”

”తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో… పౌరహక్కుల పోరాటాల్లో…ఒక శకం ముగిసినట్లు అయ్యింది. గద్దర్ కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.” -చంద్రబాబు

”ప్రజా గాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందని సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. విప్లవోద్యమాలకి తన పాటనిచ్చారు. తెలంగాణ ఉద్యమ గళం అయ్యారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల పాటకి జోహార్. ఉద్యమగీతానికి జోహార్. గద్దర్ అమర్ రహే..” -నారా లోకేష్

”నీ గానం…
తెలంగాణ వేదం

నీ గజ్జె…
తెలంగాణ గర్జన

నీ గొంగడి…
తెలంగాణ నడవడి

నీ గొంతుక…
తెలంగాణ ధిక్కార స్వరం

నీ రూపం…
తెలంగాణ స్వరూపం

గద్దరన్నా…
నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం

నీ మరణం…
నా గుండెకు శాశ్వత గాయం”

-రేవంత్ రెడ్డి

ప్రజా యుద్దనౌక గద్దర్ గారి మరణ వార్త అత్యంత బాధాకరం. మొన్న యాప్రాల్ లో గద్దరన్నతో వేదిక పంచుకునే అవకాశమొచ్చింది. అదే చివరిదని ఊహించలేదు. విద్యార్థి దశలో ఊరు మనదిరా, వాడ మనదిరా అన్న పాటను 1987 లో అంబేద్కర్ జయంతి సందర్భంగా గద్దరన్న గొంతు నుండి విన్నాను. ఎన్నో తరాలను ప్రభావితం చేసిన ఈ గొంతుక నేడు మూగబోవడం దేశానికి తీరనిలోటు. ఈ ప్రజాగాయకుడి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. -ప్రవీణ్ కుమార్, బీఎస్పీ