మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు సెగ్మెంట్లలో గురువారం టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఉప్పల్ కాంగ్రెస్ నాయకుడు రాగి
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు సెగ్మెంట్లలో గురువారం టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఉప్పల్ కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మా రెడ్డి మద్దతుదారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆయన వ్యతిరేక వర్గమైన పరమేశ్వర్ రెడ్డి మద్దతుదారులు చింపివేయడంతో గొడవ ప్రారంభమైంది.
ఉప్పల్‌లోని ఏషియన్ మల్టీప్లెక్స్ దగ్గర లక్ష్మా రెడ్డి మద్దతుదారులు ఏర్పాటు చేసిన పోస్టర్‌ను ఉప్పల్‌కు చెందిన మరో కాంగ్రెస్ నాయకుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి మద్దతుదారులు చించివేశారు. దాంతీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవను కవర్ చేస్తున్న కొంతమంది వీడియో జర్నలిస్టులపై పరమేశ్వర్‌రెడ్డి మద్దతుదారులు వెంబడించి దారుణంగా దాడి చేశారు. ఒక జర్నలిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, మీడియాపై దాడిని నిరసిస్తూ జర్నలిస్టులు మల్కాజిగిరి ప్రాంతంలో టీపీసీసీ చీఫ్ పర్యటనను బహిష్కరించారు. అంతకుముందు ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి బస్టాండ్ వరకు పాదయాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి ఉప్పల్‌లో జరుగుతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను సమీక్షించారు.
ఉప్పల్ కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మా రెడ్డి, కార్పొరేటర్ రంజిత భర్త పరమేశ్వర్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. కొంత కాలంగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎద్దులు రెండూ కొట్లాడుకొని మధ్యలో దూడను బలిచేసినట్టు కాంగ్రెస్ లోని రెండు వర్గాలు కొట్లాడుకొని జర్నలిస్టులపై దాడి చేయడం గర్హనీయం