HomeTelanganaPolitics

త్వరలో బీజేపీలోకి నటి జయసుధ?

త్వరలో బీజేపీలోకి నటి జయసుధ?

తెలంగాణ Telangana లో అసెంబ్లీ ఎన్నికలు Assembly Elections దగ్గరికి వస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల్లో చేరికలు, జంపింగులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంల

మోడీతో ప్రైవేటు మీటింగ్ లో మాట్లాడిన సంచలన విషయాలు బైటపెట్టిన కేసీఆర్
అందరి దగ్గర డబ్బులు తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకు ఓటేయండి… ఆర్జీవీ
కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?

తెలంగాణ Telangana లో అసెంబ్లీ ఎన్నికలు Assembly Elections దగ్గరికి వస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల్లో చేరికలు, జంపింగులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు వేరే పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలోకి తీసుకరావడమే గెలుపుకు మార్గమని నమ్ముతున్నారు. ప్రముఖ నాయకులతో పాటు సినీ నటీ నటులను కూడా పార్టీలోకి తీసుకవస్తే ఆ గ్లామర్ తో గెలవచ్చని అంచనాలు వేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు ప్రముఖ తెలుగు నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయసుధను Jayasudha బీజేపీ BJP లోకి తీసుకెళ్ళడానికి ఆ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా ఆమె కోసం పార్టీ నాయకులు ప్రయత్నించినప్పటికీ, బీజేపీలోకి జయసుధ వస్తోందంటూ హడావుడి చేసినప్పటికీ అప్పుడెందుకో సక్సెస్ కాలేదు. అప్పుడు బీజేపీ చేరికల కమిటీ bjp joinings committee జయసుధతో మంతనాలు జరిపింది. అయితే పార్టీ అగ్రనేతలనుండి తనకు స్పష్టమైన హామీ లభిస్తే కానీ తాను బీజేపీలో చేరబోనని ఆమె స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత కొంత కాలం ఆమె చేరిక విషయం మరుగునపడిపోయింది.

ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో మళ్ళీ జయసుధను బీజేపీలో చేర్చుకోవడం పై ఆ పార్టీ నాయకత్వం దృష్టి సారించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమై గంటకు పైగా చర్చలు జరపడంతో మళ్ళీ జయసుధ బీజేపీ లో చేరిక అంశం తెరపైకి వచ్చిది. ఆమెను బీజేపీలో చేర్చుకొని సికింద్రాబాద్‌ Secunderabad అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి కానీ పోటీ చేయించాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. 2009 లో ఆమె కా౦గ్రెస్ తరపున సికిందరాబాద్ లో పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.

సికిందరాబాద్ లో బీజేపీకి మంచి ఓటు బ్యాంకు ఉంది దాంతో పాటు క్రిస్టియన్ల ఓట్లు కూడా ఆ నియోజకవర్గంలో ప్రభావం చూయించగల్గిన స్థాయిలో ఉన్నాయి. అందువల్ల జయసుధ ఆ స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని బీజేపీ నేతలు ఊహిస్తున్నారు. అయితే బీజేపీలో చేరడానికి జయసుధ షరతులు ఏంటి ? ఆమె షరతులకు బీజేపీ నాయకత్వం తల ఒగ్గుతుందా ? ఇవన్నీ జరిగి ఆమె బీజేపీలో ఎప్పుడు చేరుతారు అనేది త్వరలోనే తేలిపోవచ్చు.