HomeTelanganaPolitics

కేసీఆర్ కుటుంబ సభ్యుడు మరొకరికి కీలక పదవి

కేసీఆర్ కుటుంబ సభ్యుడు మరొకరికి కీలక పదవి

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మరొక కుటుంబ సభ్యుడికి కీలక పదవి లభించింది. ఇప్పటికే కేసీఆర్ తో

పూర్తి సబ్సిడీతో మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం
మనం ఓడిపోతున్నామని మనమే ప్రచారం చేస్తే ఎట్లా ? నాయకులకు కేటీఆర్ క్లాస్…ఆడియో లీక్
‘పల్లెపల్లెనా ప్రజా కోర్టులు పెడదాం… తిరగబడదాం.. తరిమి కొడదాం…’

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మరొక కుటుంబ సభ్యుడికి కీలక పదవి లభించింది. ఇప్పటికే కేసీఆర్ తో పాటు, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్ రావు, అన్న కుమారుడు సంతోష్ రావులు కీలక బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావు ను మహా రాష్ట్ర BRS ఇంచార్జ్ గా నియమించారు.

మహారాష్ట్ర లో తమ కార్యక్రమాలను విస్త్రుత పర్చే లక్ష్యంతో బీఆర్‌ఎస్ మహారాష్ట్ర రాష్ట్ర యూనిట్‌కు 15 మంది సభ్యులతో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. BRS అధ్యక్షుడు స్టీరింగ్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర రాష్ట్ర విభాగం ఇన్‌చార్జిగా నియమితులైన కల్వకుంట్ల వంశీధర్‌రావు స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. స్టీరింగ్ కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు శంకర్ అన్నా ధోంగే, భానుదాస్ ముర్కుటే, అన్నాసాహెబ్ మానే, దీపక్ ఆత్ర, మాజీ ఎంపీ హరిభౌ రాథోడ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదమ్, ఘనశ్యామ్ షెలార్, జ్ఞానేష్ వకుద్కర్, సచిన్ సాఠే, శుశ్రీ సురేఖా పుణేఖర్, కదీర్ మౌలానే, ఫిరోజ్ పటేల్ ఉన్నారు.

అదేవిధంగా, బీఆర్‌ఎస్ మహారాష్ట్ర రాష్ట్ర యూనిట్‌కు చెందిన నాగ్‌పూర్ డివిజన్ కోఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే చరణ్ వాఘ్మారేను కూడా కేసీఆర్ నియమించారు. బీఆర్‌ఎస్ నాగ్‌పూర్ డివిజన్ కోఆర్డినేటర్‌గా ఉన్న జ్ఞానేష్ వకుద్కర్‌కు స్టీరింగ్ కమిటీ మెంబర్‌గా పదోన్నతి లభించింది. ఆ సందర్భంగా నాగ్‌పూర్ డివిజన్‌లో వకుద్కర్ పార్టీకి చేసిన కృషిని కేసీఆర్ అభినందించారు. అంతేకాదు, మహారాష్ట్రలో కొనసాగుతున్న పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి, కేసీఆర్ మహారాష్ట్రలోని ప్రతి ఆరు ప్రాంతీయ డివిజన్లలో ఆరుగురు కో-ఆర్డినేటర్లను కూడా నియమించారు. ఇది కాకుండా, బీఆర్ఎస్ పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసేందుకు మహారాష్ట్రలోని మొత్తం 36 జిల్లాల్లో జిల్లా కో-ఆర్డినేటర్లను నియమించారు.