HomeTelanganaGeneral

60 అడుగులకు చేరువలో గోదావరి

60 అడుగులకు చేరువలో గోదావరి

ఖమ్మం జిల్లా బ్యూరో : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం సాయంత్రం వరకు 60 అడుగుల చేరుకునే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సిద్ధం

హింస, దాడులు, మహిళల నగ్న ఊరేగింపులు, అత్యాచారాలు… మండుతున్న మణిపూర్ మోడీకి ఎందుకు పట్టదు ?
బెంగళూరులో డబుల్ సూపర్ ఓవర్… టీమిండియా గెలుపు
ఈ కొత్త బ్యాటరీలో 50 ఏళ్లకు సరిపడా చార్జింగ్! ఇక చార్జర్ల అవసరం లేనట్టేనా?

ఖమ్మం జిల్లా బ్యూరో : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం సాయంత్రం వరకు 60 అడుగుల చేరుకునే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సిద్ధంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీటి తొలగింపును పరిశీలించిన వరద సహాయక చర్యల ప్రత్యేక అధికారి అనుదీప్. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీటి తొలగింపును ఆయన పరిశీలించారు.నీటి తొలగింపు ప్రక్రియలో ప్రస్తుతం పని చేస్తున్న మోటార్ల కెపాసిటీ, అదనపు మోటర్లు ఏర్పాటు గురించి ఇరిగేషన్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ ఎస్ ఈ శ్రీనివాస రెడ్డి, ఈ ఈ రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బిపిఎల్ పాఠశాలకు చేరుకున్న హెలికాప్టర్ ను ఆయన పరిశీలించారు. అత్యవసర సమయాల్లో అందించాల్సిన సేవలను పైలెట్లకు వివరించారు. గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా హెలికాప్టర్ సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు.