బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల చేసిన ట్వీట్ అభిమానులు, నెటిజన్లలో ఒకింత గందరగోళం, వినోదాన్ని కలిగించింది. ఆమె తన ట్వీట్లో, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల చేసిన ట్వీట్ అభిమానులు, నెటిజన్లలో ఒకింత గందరగోళం, వినోదాన్ని కలిగించింది. ఆమె తన ట్వీట్లో, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు, దాంతో ఆమెపై ట్రోలింగ్ ప్రారంభమైంది ఊహాగానాలకు దారితీసింది.
ఊర్వశి రౌతేలా బ్రో సినిమాలో ఓ పాటలో నటించారు. ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సీఎం,సీఎం అని అరిచిన నేపథ్యంలో ఆమె ఈ ట్వీట్ చేయడం గమనార్హం.
ఆమె ట్వీట్ లో , ”గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది
మా చిత్రం #BroTheAvatar జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది అందరం కలుద్దాం ” అని కామెంట్ చేశారు
ఆ ట్వీట్ పై పలువురు నెటిజనులు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. కొంతమంది నెటిజన్లు ఈవెంట్ సమయంలో అభిమానులు సీఎం, సీఎం అని అరిచిన కారణంగా ఊర్వశి రౌతేలా గందరగోళానికి గురయ్యారని కామెంట్ చేశారు.
పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి దగ్గరనే ఆపడం ఎందుకను, ఆయనను ప్రధానిమంత్రి పదవి ఇవ్వొచ్చుకదా అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరి కొందరేమో పాపం జగన్ ఎలా ఫీలవుతున్నారో అని వ్యాఖ్యానించారు.