HomeTelangana

తెలంగాణకు గుడ్ న్యూస్… ఇక భారీ వర్షాలు లేనట్టే

తెలంగాణకు గుడ్ న్యూస్… ఇక భారీ వర్షాలు లేనట్టే

నాలుగు రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ వినిపించింది.బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేటి ఉద

అక్కడ రోడ్లపై కార్లు పారుతున్నాయి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం
హైదరాబాద్ ప్రజలకు రెడ్ అలర్ట్

నాలుగు రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ వినిపించింది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేటి ఉదయం బలహీనపడిందని, మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప ఇక భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ముందుగా ప్రకటించినప్పటికీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడిన కారణంగా భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టే అని ప్రకటించింది.

కాగా, తెలంగాణలో కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద వర్షాలుగా నమోదయినట్లు డైరెక్టర్ నాగరత్న తెలిపారు. కొన్ని జిల్లాల్లో అసాధారణ భారీ వర్షాలు కురిసాయి.

అయితే, ఆగస్ట్ రెండో వారంలో, సెప్టెంబర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని నాగరత్న తెలిపారు.