HomeCrimeInternational

తన ఫోన్ దొంగతనం చేసిన వ్యక్తిని ప్రేమించిన యువతి, రెండేళ్ళుగా డేటింగ్

తన ఫోన్ దొంగతనం చేసిన వ్యక్తిని ప్రేమించిన యువతి, రెండేళ్ళుగా డేటింగ్

దొంగల పట్ల సమాజంలో వ్యతిరేక భావం ఉంటుంది. ఇక ఎవరైనా దొంగ మన వస్తువులనే దొంగతనం చేస్తే వారిపై కోపం, కసి వస్తుంది. దొరికితే తన్నాలనిపిస్తుంది. కానీ మనం

కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తప్పిన పెను ప్రమాదం!
చోరీకి వెళ్ళి బ్యాంకును ప్రశంసలతో ముంచెత్తి వెనక్కి వెళ్ళిపోయిన దొంగ‌
14 మంది పాపులర్ ఫ్రంట్ కార్యకర్తలకు ఉరి శిక్ష‌

దొంగల పట్ల సమాజంలో వ్యతిరేక భావం ఉంటుంది. ఇక ఎవరైనా దొంగ మన వస్తువులనే దొంగతనం చేస్తే వారిపై కోపం, కసి వస్తుంది. దొరికితే తన్నాలనిపిస్తుంది. కానీ మనం చెప్పుకోబేయే యువతి పూర్తి విరుద్దంగా ఆలోచించింది. తన సెల్ ఫోన్ దొంగతనం చేసిన దొంగ ప్రేమలో పడిపోయింది.

బ్రెజిల్ లో ఇమాన్యులా అనే ఓ బ్యూటీ వీధిలో నడుస్తుండగా ఓ దొంగ ఆమెదగ్గరున్న సెల్ ఫోన్ గుంజుకొని పారిపోయాడు. అయితే ఆ తర్వాత ఆ ఫోన్ లో ఆమె ఫోటోను చూసి ఆ దొంగ మనసు పడేసుకున్నాడు. ఆమె దెగ్గర ఫోన్ కొట్టేసి తప్పు చేశాన్బని పశ్చాత్తాపపడ్డాడు. ఆమె ఫోటోను చూసి తెగ ప్రేమించేశాడు. అప్పటి వరకు ఏ యువతి పరిచయంలేని ఆ దొంగ ఇమాన్యులా ప్రేమలో పడిపోయి మనిషి పూర్తిగా మారిపోయాడు. ఆమె దగ్గరికి వెళ్ళి కథంతా చెప్పి తన ప్రేమ కథను కూడా చెప్పాడు. ఇమాన్యులా కూడా ఈ ప్రేమ దొంగను చూసి మనసు పారేసుకుంది. ఇంకేముంది ఇద్దరూ డేతింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ వారిద్దరూ డేటింగ్ చేస్తూ రెండేళ్ళు గడిచిపోయింది.

ఈ మధ్య బ్రెజిల్ లో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొని తమ ప్రేమ కథను గుర్తు చేసుకున్నారు. ఇమాన్యులా తన కలల రాజకుమారుడిని కలిసిన మొదటి రోజును గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది.

ఇక వీరిద్దరి ప్రేమ కథ ట్విట్టర్ లో చీసిన నెటిజనులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ పోస్ట్ కు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇలాంటి విచిత్రమైన ప్రేమకథలు రొమాన్స్, అభిరుచి ఉన్న బ్రెజిల్ నుండి మాత్రమే ఉంటాయని చాలా మంది నెటిజనులు కామెంట్ చేశారు.

వీరి ప్రేమ కథ మనోహరంగా ఉందని, ప్రేమ ఎక్కడైనా, ఏ పరిస్థితిలోనైనా వికసించగలదని కామె౦ట్ చేస్తున్న నెటిజనులు ఆ జంటకు మద్దతు తెలుపుతున్నారు.