HomeTelanganaPolitics

70 మంది సిట్టింగులకు టిక్కట్లు గ్యారంటీ… BRS తొలి లిస్ట్ విడుదల ఎప్పుడంటే …?

70 మంది సిట్టింగులకు టిక్కట్లు గ్యారంటీ… BRS తొలి లిస్ట్ విడుదల ఎప్పుడంటే …?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో బీఆరెస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఉదయం నుండి మంత్రులు, పార్టీ సీనియర్లతో ప్రగతి భవ

సీఎం కేసీఆర్ నియోజకవర్గాన్ని మారుస్తున్నారా? గజ్వేల్‌కు గుడ్ బై చెప్తారా?
మోడీతో ప్రైవేటు మీటింగ్ లో మాట్లాడిన సంచలన విషయాలు బైటపెట్టిన కేసీఆర్
కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో బీఆరెస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఉదయం నుండి మంత్రులు, పార్టీ సీనియర్లతో ప్రగతి భవన్ లో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా ఐదు నెలలు కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థుల జాబితాను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి ప్రచారానికి ఇతర పార్టీల కంటే ముందుగా వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.

ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలాబలాలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తదితర అంశాలపై బీఆరెస్ నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. వచ్చే నెల చివరి వారంలో తొలి లిస్ట్ ప్రకటించాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం. కేసీఆర్ స్వయంగా చేయించిన సర్వే ఆధారంగా తప్పకుండా గెలుస్తారనుకుంటున్న దాదాపు 70 మంది సిట్టింగులతో తొలి లిస్ట్ ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ప్రజలు పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, ప్రజలతో రెగ్యులర్ సంబంధాల్లో ఉండటం, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చొరవచూపడం, గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండటం, అందరినీ కలుపుకపోవడం తదితర లక్షణాలున్న సిట్టి౦గులు దాదాపు 60 మందికి పైగానే ఉన్నారని కేసీఆర్ చేయించిన సర్వేలో తేలింది. అంతే కాకుండా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్ర‌మాల వల్ల ఖచ్చితంగా బీఆరెస్ కు ఓట్లేసే ప్రజల శాతాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని, ఎలాంటి వివాదాలు లేని 70 మందికి ఖచ్చితంగా తిరిగి టిక్కట్లు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఈ రోజు జరిగిన సమావేశంలో నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం.

మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో ప్రస్తుతం బీఆరెస్ కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మధ్యే మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూడా బీఆరెస్ ఎమ్మెల్యేనే.

మొత్తం 119 సీట్లలో MIM కు ఏడుగురు శాసన సభ్యులున్నారు. ఆ స్థానంలో మిగతా పార్టీలు గెలిచిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. వాటిని పక్కనపెడితే మిగతా 112 సీట్లకు గాను 70 మందితో BRS తొలి లిస్ట్ ప్రకటిస్తే మిగతా 42 సీట్లలో దాదాపు 15 నుండి 20 స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. అదే విషయంపై ఈ రోజు BRS నేతలతో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది.

ఒక వైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ జాబితాలు తయారు చేసే పనిలో కేసీఆర్, ఇతర సీనిఅయర్ నాయకులు బిజీగా ఉంటే. తమకు టిక్కట్టు వస్తుందో రాదో అర్దం కాక పలువురు బీఆరెస్ సిట్టింగులు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ టిక్కట్ రాదని ముందుగానే తేలితే వేరే పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఎక్కడైతే సిట్టింగులకు టిక్కట్టు ఇవ్వొద్దని కేసీఆర్ అనుకుంటున్నారో ఆ నియోజకవర్గాల అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించే అవకాశం ఉంది.