HomeInternational

ప్రంచానికి AI వల్ల ప్రమాదం – ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చ‌

ప్రంచానికి AI వల్ల ప్రమాదం – ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చ‌

ఐక్యరాజ్యసమితి UNO భద్రతా మండలి United Nations Security Council ఈ వారం New York న్యూయార్క్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ artificial intelligence (AI)ప

AIనీ వాడేస్తున్న సైబర్ నేరగాళ్లు… మొహం మార్చుకొని స్నేహితుడని నమ్మించి సొమ్ము కొట్టేసిన నేరగాడు
మొదలైన సంక్షోభం: AI కి వ్యతిరేకంగా పోరాటం షురూ…స్తంభించిన హాలీవుడ్
సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న AI కేసీఆర్

ఐక్యరాజ్యసమితి UNO భద్రతా మండలి United Nations Security Council ఈ వారం New York న్యూయార్క్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ artificial intelligence (AI)పై తన మొదటి అధికారిక చర్చను నిర్వహించనుంది. ప్రపంచ శాంతి, భద్రతపై దాని ప్రభావం గురించి అంతర్జాతీయ చర్చ‌కు బ్రిటన్ పిలుపునిచ్చింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మర్చేయగల, అంతర్జాతీయ భద్రతా పరిస్థితులను మార్చగల స్థాయిలో ఉన్న AI సాంకేతికత ప్రమాదాలను ఎలా తగ్గించాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి.
బ్రిటన్ ఈ నెలలో UN భద్రతా మండలి అధ్యక్ష పదవిలో ఉంది. AI నియంత్రణలో ప్రపంచ నాయకత్వ పాత్రను కోరుతోంది.

బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీ మంగళవారం చర్చకు అధ్యక్షత వహించనున్నారు.

జూన్‌లో, U.N సెక్రటరీ-జనరల్ Antonio Guterres ఆంటోనియో గుటెర్రెస్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) వంటి అంతర్జాతీయ AI వాచ్‌డాగ్ బాడీని రూపొందించడానికి కొంతమంది కృత్రిమ మేధస్సు అధికారులు చేసిన ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు.