HomeCinemaInternational

10 సెకన్లు లైంగిక వేధింపులకు పాల్పడితే నేరం కాదట… తీర్పిచ్చిన కోర్టు

10 సెకన్లు లైంగిక వేధింపులకు పాల్పడితే నేరం కాదట… తీర్పిచ్చిన కోర్టు

ఇటలీ రోమ్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో 17 ఏళ్ల బాలిక తరగతికి హాజరయ్యేందుకు మెట్ల మీదుగా వెళుతుండగా, పాఠశాల కేర్‌టేకర్ ఆమె ప్యాంట్‌ను కిందకు లాగి, ఆమె పిరుద

వేణుస్వామి అరెస్టు తప్పదా ?
రజినీ కాంత్ ‘జైలర్’ మూవీ ఫ‌స్ట్ డే, ఫస్ట్ షో చూసేందుకు జపాన్ నుంచి చెన్నై వచ్చిన జపాన్ దంపతులు
టాలీవుడ్ నటులు రాజశేఖర్, జీవితలకు జైలు శిక్ష

ఇటలీ రోమ్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో 17 ఏళ్ల బాలిక తరగతికి హాజరయ్యేందుకు మెట్ల మీదుగా వెళుతుండగా, పాఠశాల కేర్‌టేకర్ ఆమె ప్యాంట్‌ను కిందకు లాగి, ఆమె పిరుదులను తాకి, ఆమె లోదుస్తులను పట్టుకున్నాడు. అనంతరం బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఏప్రిల్ 2022న జరిగిన ఈ సంఘట్నపై నిన్న కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు విచారణలో, ఆ వ్యక్తి బాలికను పట్టుకున్నట్లు అంగీకరించాడు. తానది సరదాకు చేశానని చెప్పాడు.

కోర్టు కేర్ టేకర్ పై కేసు కొట్టివేసి ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. ఆయన చేసిన లైంగిక దాడి ఎక్కువసేపు కొనసాగలేదని, 10 సెకన్లు మాత్రమే దాడి జరిగింది9 కాబట్టి దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.

ఈ తీర్పు ఇటలీలో ఆగ్రహానికి కారణమయ్యింది. నెటిజనులు ఈ తీర్పుపై సోషల్ మీడియాలో వ్యగ్యంగా, ఆగ్రహంగా స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో “బ్రీఫ్ గ్రోపింగ్” ”10 సెకన్లు” వంటి హ్యాష్‌ట్యాగ్ లు వైరలయ్యాయి. ఇటలీలోని Instagram, TikTokలో #10secondi అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు “palpata breve” లేదా “బ్రీఫ్ గ్రోపింగ్” అనే కొత్త ట్రెండ్ వ్యాపించింది.
ఇటాలియన్లు కెమెరాను నిశ్శబ్దంగా చూస్తూ, 10 సెకన్ల పాటు వారి సన్నిహిత భాగాలను తాకిన వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు. “వైట్ లోటస్” నటుడైన పాలో కామిల్లి ఈ వ్యంగ్య విమర్శలను ప్రారంభించారు. అప్పటి నుండి వేలాది మంది దీనిని అనుసరించారు. 29.4 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో ఇటలీకి చెందిన అత్యంత ప్రఖ్యాత ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన చియారా ఫెరాగ్నీ కూడా ఈ వీడియోలలో ఒకదాన్ని రీపోస్ట్ చేశారు.