HomeTelanganaPolitics

తెలంగాణ నుంచి నరేంద్రమోడీ, ప్రియాంకా గాంధీ పోటీ ?

తెలంగాణ నుంచి నరేంద్రమోడీ, ప్రియాంకా గాంధీ పోటీ ?

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తెలంగాణపై కాంగ్రెస్,బీజేపీలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియ

నోరు మూసుకోక పోతే ఇంటికి ఈడీని పంపుతా – విపక్షాలకు కేంద్ర మంత్రి హెచ్చరిక‌
ఈటలపై పైచేయి సాధించిన బండి సంజయ్…వేములవాడలో టెన్షన్ టెన్షన్
రాహుల్ రావణుడు, మోడీ దానవుడు…. కాంగ్రెస్, బీజేపీల పోస్టర్ వార్

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తెలంగాణపై కాంగ్రెస్,బీజేపీలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని ఊహాగానాలు చెలరేగుతుండగా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ నుండి లోక్ స‌భకు పోటీకి దిగడంపై పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సార్వత్రిక ఎన్నికలకు మోడీ నిజంగానే తెలంగాణా నియోజకవర్గాన్ని ఎంచుకుంటారో లేదో అనిశ్చితంగానే ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి ఇక్కడి నుండే పోటీ చేయాలని తెలం గాణ బిజెపి నేతలు గట్టిగా కోరుతున్నారు.

కర్ణాటకలో బీజేపీ ఓటమి తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 170 సీట్లు గెలుచుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో, మోడీ దక్షిణ భారతదేశం నుండి పోటీ చేయడం వల్ల‌ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలోని బిజెపి అభ్యర్థులకు లాభ‍ం జరుగుతుందని, అందువల్ల ఇక్కడి నుంచి ఆయన్ పోటీ చేయాలని మెజార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.

తెలంగాణలోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీని పోటీకి దింపేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ నియోజకవర్గం నుండి, మాజీ ప్రధాని, ప్రియాంక నాయన‌మ్న ఇందిరా గాంధీ పోటీ చేసి గెలిచారు. కాబట్టి ఆ నియోజకవర్గంలో ప్రియాంకను పోటీకి దించితే ఆ ప్రభావం ఒక్క తెలంగాణమీదనే కాకుండా దక్షిణ భారతదేశం అంతా ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అందుకు ప్రతిగా తెలంగాణలోని ఒక నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోడీని పోటీకి దించే ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా పరిశీలిస్తోంది.

తొలుత కర్ణాటక లేదా తమిళనాడులోని లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని పోటీ చేయాలని బీజేపీ నేతలు ఆలోచించారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా తెలంగాణలో ప్రియాంక గాంధీ పోటీకి దిగుతారనే వార్తలు రావడంతో అందుకు ప్రతిగా తెలంగాణలో ఏదైనా ఒక‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓ ప్రముఖ నేతను రంగంలోకి దింపేందుకు బీజేపీ వ్యూహరచన చేసింది. నరేంద్ర మోడీ తెలంగాణలో పోటీ చేస్తే సౌత్ ఇండియా మొత్తంపై ఆ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ నేతలు అగ్రనేతలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, సికింద్రాబాద్‌కే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం, కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ నియోజకవర్గంలో బిజెపికి గట్టి పట్టు ఉంది. ఒకవేళ‌ ప్రధానమంత్రి తమిళనాడును ఎంచుకుంటే, రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయవచ్చు. లేదంటే కర్ణాటకలో బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గం ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.