HomeNational

స్మార్ట్ ఫోన్ అడిక్షన్ కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోయిన చిన్నారి!

స్మార్ట్ ఫోన్ అడిక్షన్ కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోయిన చిన్నారి!

ప్రజలు రోజురోజుకూ స్మార్ట్ ఫోన్ కు భానిసలై పోతున్నారు. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్ ఫోన్ల భారిన పడి వారి జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ల

మోగనున్న అసె‍ంబ్లీ ఎన్నికల నగారా – ఈ నెల 10లోపు నోటిఫికేషన్ విడుదల‌
5 రాష్ట్రాల్లో సీ ఓటర్ సర్వే… కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో, బీజేపీ 1, ఇతరులు ఒక రాష్ట్రంలో గెలుపు
ఫ్యాన్లు మారిస్తే ఆత్మహత్యలు ఆగుతాయా ? ‘కోట’లో మరో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య‌

ప్రజలు రోజురోజుకూ స్మార్ట్ ఫోన్ కు భానిసలై పోతున్నారు. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్ ఫోన్ల భారిన పడి వారి జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లో గేమ్ లు ఆడుతూ తమ తల్లితండ్రుల అకౌట్ల ను ఖాళీ చేసిన వార్తలు ఎన్నో చూశాం. ఈ గేమ్స వల్ల లక్షల రూపాయలు పోగొట్టుకుని రోడ్డుమీదపడ్డవారున్నారు. ఇప్పుడు రాజస్థాన్ లో ఓ బాలుడు స్మార్ట్ ఫోన్ లోని ఓ గేమ్ కు భానిసై పోయి చివరకు మతిస్థిమితం తప్పాడు.

రాజస్థాన్ లోని అల్వార్లో ఓ పదేళ్ళ చిన్నారి స్మార్ట్ ఫోన్ లో 24 గంటలూ ఫ్రీఫైర్ అనే గేమ్ ఆడుతూ గడిపేవాడు. తాజాగా ఆ ఆటలో ఓడిపోవడంతో ఆ బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. మానసిక సమతుల్యత కోల్పోయి తీవ్ర వణుకుతో బాధపడుతున్నాడు. అతన్ని ప్రత్యేక పాఠశాలకు పంపినట్లు మీడియా సంస్థలు నివేదించాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ భవానీ శర్మ మాట్లాడుతూ, పిల్లవాడు PUBG మరియు ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌లు ఆడేవాడని, ఆ గేమ్‌లలో ఓడిపోవడాన్ని తట్టుకోలేక ఆ గేమ్‌లలో చాలా నష్టపోయాడని మీడియాకు తెలిపారు.

“మా అంచనా ప్రకారం, అతని బంధువులు చెప్తున్న దాని ప్రకారం, ఆ బాలుడు ఫ్రీ ఫైర్ వంటి ఆటలకు బాధితుడు. అతను ఆటలో ఓడిపోయాడు. ఆటగాడు ఓడిపోతే తట్టుకోలేని విధంగా ఉంటుంది. వారు ఆత్మహత్యతో చనిపోతారు లేదా వారి మానసిక సమతుల్యతను కోల్పోతారు. ఈ పిల్లాడు కూడా మానసిక సమతుల్యత కోల్పోయాడు. మేము పిల్లల కోసం క్రీడా కార్యకలాపాల ఫార్మాట్‌ను సిద్ధం చేసాము. దాని ప్రకారం పిల్లవాడు ఓటమి భయాన్ని అధిగమించి, అతని విజయాన్ని గుర్తుంచుకునేలా మేము సహాయం చేయాలి, ”అని శర్మ చెఅన్నారు.

గేమింగ్ డిజార్డర్ అంటే ఏమిటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, గేమింగ్ డిజార్డర్ అనేది డిజిటల్-గేమింగ్ లేదా వీడియో-గేమింగ్ ఎక్కువగా ఆడటం వల్ల వచ్చే జబ్బు. ఈ జబ్బు వల్ల పిల్లలకు గేమింగ్ ఆడే విషయంలో తమపై నియంత్రణ ఉండదు. ఇతర కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎప్పుడూ గేమింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వలన అతను ఇతర విషయాలపై ఆసక్తిని కోల్పోతాడు.

గేమింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నవ్యక్తి ప్రవర్తనా విధానం వ్యక్తిగత, కుటుంబం, సామాజిక, విద్యా, వృత్తి, ఇతర ముఖ్యమైన కార్యకలాపాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.

ఇఅతర పనులేమీ చేయరు. చదువులో పూర్తిగా వెనకబడతారు. వారికి ఎప్పుడూ ఆందోళన, చిరాకు వంటివి ఉంటాయి.

ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి ఆ గేమ్ ఆడకుండా ఉన్నప్పుడు ఎప్పుడూ బాధపడతూనే ఉంటాడు.

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మనిషిలో దుందుడుకు తనం పెంచుతుంది.

వీడియో గేమ్‌లు ఆడే వ్యక్తులు తమ ఆరోగ్యం, సామాజిక పనితీరు ప్రభావితం కాకుండా చూసేందుకు గేమింగ్‌లో గడిపే సమయం గురించి జాగ్రత్తగా ఉండాలని WHO సూచిస్తోంది.

పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చినప్పుడు తల్లి తండ్రులు వాళ్ళను ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలని గేమింగ్ వ్యసనం కాకుండా చేయాల్సిన బాధ్యత తల్లితండ్రులదే అని నిపుణులు చెప్తున్నారు.