అమెరికాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఉచిత విధ్యుత్ వ్యాఖ్యలు తెలంగాణలో రచ్చరేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఉపయోగించుకొని కాంగ్రెస్ ను దెబ్బతీసే
అమెరికాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఉచిత విధ్యుత్ వ్యాఖ్యలు తెలంగాణలో రచ్చరేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఉపయోగించుకొని కాంగ్రెస్ ను దెబ్బతీసే అన్ని అవకాశాలను అధికార బీఆరెస్ వాడుకుంటోంది. కేటీఆర్ తో సహా మంత్రులందరూ కాంగ్రెస్ పై విరుచుకపడటమే కాకుండా రాష్ట్రవ్యాప్త నిరసనలకు తెరలేపింది.
మరో వైపు కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ వ్యాఖ్యలపై ముసలం మొదలైంది. ఉచిత విధ్యుత్తు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించడానికి రేవంత్ ఎవరు? ఆయనకేం హక్కు ఉంది అని కాంగ్రెస్ సీనియర నాయకుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి మండుపడ్డారు.
తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో ఇంత రచ్చజరుగుతూ ఉంటే అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి ఆలస్యంగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విధ్యుత్తు ఇస్తారా లేదా మాట్లాడకుండా బీఆరెస్ పై విరుచుకపడ్డారు.
‘
‘బీఆర్ఎస్ బీజేపీ కి “బి” టీం అని మరోసారి నిరూపితమైంది.
రేపు రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుకు నిరసనగా “సత్యాగ్రహ దీక్ష” పిలుపుని నీరుగార్చాలని, ఉచితవిద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది.
12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుంది….
తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్….
ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నాం.” అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.
ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న రచ్చ రేవంత్ జవాబుతో ఆగేలా కనిపించడంలేదు. బీఆరెస్ ఎలాగూ తన రాజకీయ ప్రయోజనాల కోసం తాను ప్రయత్నిస్తుంది. అయితే కాంగ్రెస్ నిజంగానే రైతులకు ఉచిత విధ్యుత్తు ఇవ్వబోదని రైతులు కనక నమ్మితే ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్న కాంగ్రెస్ పని ఖతమైనట్టే.
🔥బీఆర్ఎస్ బీజేపీ కి “బి” టీం అని మరోసారి నిరూపితమైంది.
— Revanth Reddy (@revanth_anumula) July 11, 2023
రేపు రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుకు నిరసనగా "సత్యాగ్రహ దీక్ష" పిలుపుని నీరుగార్చాలని, ఉచితవిద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుంది.
🔥బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది.
12…