HomeUncategorized

ఉచిత విధ్యుత్తు: రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ముసలం … అలా చెప్పడానికి రేవంత్ స్థాయి ఏంటని మండిపడ్డ కోమటి రెడ్డి

ఉచిత విధ్యుత్తు: రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ముసలం … అలా చెప్పడానికి రేవంత్ స్థాయి ఏంటని మండిపడ్డ కోమటి రెడ్డి

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికాలో ఉచిత విధ్యుత్తుపై మాట్లాడిన మాటలు తెలంగాణలో సంచలనం కలిగిస్తున్నాయి. రైతులకు 24 గంటలు ఉచిత విధ్యుత్తు అవసరం

న్యూ ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు
చంద్రుడి మీదికి చేరుకోవడానికి రష్యాకు ఒకట్టిన్నర రోజులు, అమెరికాకు నాలుగురోజులు పడితే మనకు 40 రోజులు… కారణమేంటి ?
అమెరికా: తానాలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు… ఎక్కడైనా తెలుగువాళ్ళు సత్తా చూపిస్తారన్న బాలకృష్ణ‌

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికాలో ఉచిత విధ్యుత్తుపై మాట్లాడిన మాటలు తెలంగాణలో సంచలనం కలిగిస్తున్నాయి. రైతులకు 24 గంటలు ఉచిత విధ్యుత్తు అవసరం లేదని 8 గంటలు ఇస్తే సరిపోతుందని, కార్పోరేట్ విధ్యుత్ సంస్థల కోసమే 24 గంటలు ఉచితమంటూ కేసీఆర్ మోసం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పైగా పైగా ఎకరానికి నీరు పారడానికి గంటసేపు విధ్యుత్తు సరిపోతుందని, మూడు ఎకరాలున్నవారికి 3 గంటలు చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రేవంత్ చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి భగ్గుమంది. రైతలపట్ల కాంగ్రెస్ కున్న చిత్తశుద్ది రేవంత్ వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయని బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ అవ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

మరో వైపు కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ మాటలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆయన మాటలు ఫైనల్ కాదని, ఆయన చెప్పిందే నడవడానికి ఇదేమీ ప్రాంతీయ‌ పార్టీ కాదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

”రేవంత్ చెప్పింది నడవదిక్కడ, నేను ఆయనకన్నా సీనియర్ ను స్టార్ క్యాంపెనర్ ను నాది నడుస్తదా రేవంత్ ది నడుస్తదా” అని కోమటి రెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాబోతున్నామని, అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విధ్యుత్తు మరింత పకడ్బందీగా అమలు చేస్తామని కోమటి రెడ్డి చెప్పారు.

కాగా, కోమటి రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ, పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పిందే ఫైనల్ కానీ కోమటి రెడ్డి చెప్పేది ఎవరు నమ్ముతారని ఆయన అన్నారు. పీసీసీ అధ్యక్షుడే ఉచిత విధ్యుత్తు రద్దు చేస్తామని చెప్పిన తర్వాత కోమటి రెడ్డి చెప్పిన దానికి విలువేముంటుందని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.