తెలంగాణ బీజేపీలో వర్గపోరు ముదురుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యతిరేక అనుకూల వర్గాలు ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఒక
తెలంగాణ బీజేపీలో వర్గపోరు ముదురుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యతిరేక అనుకూల వర్గాలు ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఒక వైపు ఈటల రాజేంధర్ , బండి సంజయ్ ల నడుమ చిచ్చు బహిరంగమైన నేపథ్యం లో మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు అనూహ్యంగా ఈ రోజు ఢిల్లీలో బండిసం జయ్ పై సంచలన ఆరోపణలు చేశారు.
పార్టీ కోసం పదేళ్లుగా పని చేస్తున్న తనకు అధిష్టానం సరైన గుర్తింపు ఇవ్వడంలేదని అధ్యక్ష పదవి కోసం నేను అర్హుడిని కాదా? అంటూ ప్రశ్నించారాయన తనకు ముఖ్యమైన పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జాతీయ అగ్రనేతలను కలవడానికి ఢిల్లీ వెళ్ళిన ఆయన కేం ద్ర మంత్రి కిషన్ ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ, ఎంపీ ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక భార్య పుస్తెలు అమ్మిన బండి సంజయ్ ఇప్పుడు వందల కోట్ల రూపాయలతో ఆడ్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఫోటోలతో ఓట్లు రాలవని, రఘునందన్, ఈటల రాజెందర్ బొమ్మలతోనే ఓట్లు వస్తాయని ఆయన అన్నారు.
తనకు సరైన పదవి ఇవ్వకపోతే జాతీయ అధ్యక్షుడు నడ్డాపై నరేంద్ర మోడీకి పిర్యాదు చేస్తానని రఘునందన్ రావు హెచ్చరించారు. దుబ్బాక ఉప ఎన్నికలో తనకు బీజేపీ నాయకులెవరూ సహాయం చేయలేదని చెప్పిన రఘునందన్ మునుగోడు ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఓడిపోయారని అదే 100 కోట్లు తనకు ఇస్తే తెలంగాణ మొత్తం బీజేపీని గెలిపించేవాడినని ఆయన అన్నారు.
తనకు పార్టీ అధ్యక్ష పదవి కానీ శాసనసభలో ఫ్లోర్ లీడర్ పదవి లేదా జాతీయ అధికార ప్రతినిధి పదవి కానీ, ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వాలని8 రఘునందన్ రావు డిమాండ్ చేశారు.