HomeTelanganaGeneral

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం

పిడుగుపాటుకు ముగ్గురు మృతి.. చెవులపల్లిలో ఇద్దరు, రంగయ్యపల్లిలో ఒకరు జయశంకర్‌ భూపాలపల్లి బ్యూరో, (నినాదం): ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బు

మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం… కేటీఆర్
బీజేపీ సీనియర్లు బహిర్గత పరుస్తున్న స్వంత పార్టీ కుట్రాజకీయాలు… గందరగోళంలో ఆ పార్టీ శ్రేణులు
యూనిఫాం సివిల్ కోడ్ కు మేం వ్యతిరేకం… స్పష్టం చేసిన కేసీఆర్
  • పిడుగుపాటుకు ముగ్గురు మృతి..
  • చెవులపల్లిలో ఇద్దరు, రంగయ్యపల్లిలో ఒకరు

జయశంకర్‌ భూపాలపల్లి బ్యూరో, (నినాదం): ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముగ్గురిని బలి తీసుకుంది. భారీ వర్షంతో పాటు పిడుగులు పడటంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ముగ్గురు మృతి తీవ్ర విషాదం నింపింది. బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడడంతో హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో ఇద్దరు మహిళ కూలీలు మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లిలో వ్యవసాయ కూలీ పిడుగుపాటుతో కుప్పకూలింది. చౌల్లపల్లి గ్రామానికి చెందిన ఇటకాల నిర్మల (40), సోలంక రమ(45) వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుండగా కల్లు మండువ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మల, రమ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగయ్యపల్లికి చెందిన లక్ష్మి(45) భర్తతో కలిసి వ్యవసాయ భూమిలో మిరప తోటకు పిండి చల్లుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు వచ్చి వర్షం రావడంతో పిడుగుపాటుకు గురైంది. లక్ష్మి సమీపంలోనే పిడుగు పడటంతో ఆ దాటికి ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని మెడలో ఉన్న పుస్తెలతాడు కరిగిపోయిందని భర్త నగేష్ తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హుటాహుటిన రంగయ్యపల్లికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల సాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు హామీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి చెందడంతో ఆ గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.